అన్యోన్య దాంపత్యం
దాంపత్యం అంటే… భార్యాభర్తల అన్యోన్యత. ఇది ఒక శాశ్వతబంధం. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, సీతారాములు.. అంటూ దాంపత్య ధర్మాన్ని దేవతా స్థానంలో ఉంచి ఆరాధించే సంప్రదాయం మనది. ఆ దేవదంపతులకు అనేకమార్లు కళ్యాణాలు చేస్తూ.. ఆ ఉత్సవాల ద్వారా వివాహ వ్యవస్థలోని పవిత్రతనీ, దాంపత్యంలోని శాశ్వతత్వాన్ని గుర్తు చేసుకుంటాం.
ధ్రువాసి ధ్రువోయం యజమానో స్మిన్నాయతనే!! (యజుర్వేదం)
'ఈ గృహంలో నువ్వు శాశ్వతం, యజమానియైన ఇతడు (భర్త) శాశ్వతం' ఈ వేద వాక్కు. మార్పు చెంద(కూడ)ని దంపతుల స్థిరత్వాన్ని చాటుతోంది. 'యజమాని' అంటే సత్కర్మను (యజ్ఞాన్ని) ఆచరించు వాడు అని సరైన నిర్వచనం.
భారతీయ దృక్పథంలో సతీపతుల బంధం ఇహలోక, పరలోకాలకు, జన్మజన్మలకు కొనసాగుతుంది. ఇంద్రాదులు, గంధర్వాదులు ఆ జాయాపతులకు బంధాన్ని ఏర్పరచిన వివాహ మంత్రాలు చెబుతున్నాయి. దంపతుల స్థిరత్వం కుటుంబానికి పునాది. దంపతులు అభిరుచులు, అభిప్రాయాలు, ప్రేమానురాగాలను పంచుకుంటూ, పెంచుకుంటూ అన్నింటా కుటుంబంలో ఒదిగిపోవాలి. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల దంపతుల మధ్య అనురాగం కరువగు చున్నది అటువంటి వారు ఈ క్రియతో మంచి ఫలములు పొందే అవకాశమున్నది.
నవదుర్గల్లో కాత్యాయని మాతకు ఆరో స్థానం. ఈమెకు గురు గ్రహం ఆధిపత్య దైవం. ఈమె సింహంపై ఆసీనురాలై వుంటుంది. త్రినేత్రాలను కలిగివుంటుంది. కాత్యాయని మంత్ర జపంతో కుజ దోషాలు హరించుకుపోతాయి. దాంపత్య జీవనంలో వుండే దోషాలను ఇది తొలగిస్తుంది. కాత్యాయని మంత్రాన్ని జపించే దంపతులు అన్యోన్యంగా జీవనం సాగిస్తారు. ''కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్ యతీశ్వరి
నంద గోప సుతం దేవీ పతిమే కురుతే నమః
అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః
కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కందర
విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబికే దేవీ నారాయణే నమోస్తుతే" 41 రోజులు అమ్మవారిని ఈ మంత్రంతో జపిస్తే దాంపత్య దోష నివారణ జరుగుతుంది. భార్యాభర్తల మధ్య విడాకులు అనే మాటకు చోటుండదు. ఇంకా దంపతుల మధ్య వివాదాలుండవు.
దీనితోపాటు సుదరకాండలో 24 వ సర్గ పారాయణకూడా మంచి ఫలితమును కలుగ చేయగలదు.
శుభం
లక్ష్మీ లలిత వాస్తుజ్యోతిష నిలయం.
స్వర్ణ కంకణ సన్మానిత.
జ్యోతిషరత్నశ్రీనివాస సిద్ధాంతి*

No comments:
Post a Comment