కుటుంబం
🕉️🌞🌎🏵🌼🚩
ఓ రాజు వేటకోసం అడవిలోకి వెళ్ళాడు. దట్టమైన ఆ అడవిలో ఓ సాధువు చెట్టు కింద ధ్యానంలో నిమగ్నమై ఉండటం చూసి దగ్గరగా వెళ్ళాడు. వినయంగా అడిగాడు- ‘ఇంత దట్టమైన అడవిలో మీరిలా ఒంటరిగా ఉన్నారు. రకరకాల క్రూరమృగాలు సంచరిస్తుంటాయి. భయం అనిపించదా?’
ధ్యానంలోంచి తేరుకుంటూ సగం తెరిచిన కళ్లతో- ‘నేను ఒంటరిని కాను. నా కుమారుడు, నా కుటుంబం నాతోనే ఉన్నారు కదా’ అన్నాడు.
రాజుకు అనుమానం వచ్చింది. చుట్టూ కలియజూశాడు. ఎవరూ కనిపించకపోవడంతో ‘స్వామీ, ఎవరూ లేరే... కుటుంబం అంటున్నారు... ఎక్కడ?’ అని అడిగాడు.
ఆ సాధువు శాంతంగా ‘మహారాజా, ప్రపంచంలో అన్నీ వ్యక్తం కావాలన్న నియమం లేదు. కొన్నింటిని చూడగలం. మరికొన్నింటిని చూడలేం.’
అర్థంకాని రాజు ‘నాకు బోధపడలేదు మీరేమంటున్నారో. మీ కుటుంబాన్ని పరిచయం చేయరూ’ అనడిగాడు తెలివిగా.
‘ సహనం నా తండ్రి. క్షమ నా తల్లి. శాంతి నా తోడు. కరుణ, అహింస నా సోదరీమణులు. జ్ఞానం నా ఆహారం... వీటితో బంధుత్వం కలిగిఉన్నప్పుడు ఎవరికైనా భయం ఎలా కలుగుతుంది?’
రాజుకు ఆ మాటలు చిత్రంగా అనిపించాయి .
ఎవరైతే కోరికల్లాంటివి లేకుండా తటస్థంగా ఉంటారో, ఆత్మతో లీనమై ఉంటారో... వారికి తత్వం బోధపడుతుంది .
ప్రతి వ్యక్తికీ రెండు కుటుంబాలు ఉంటాయి. ఒకటి వ్యక్తం, మరోటి అవ్యక్తం. సాధారణంగా తండ్రిగాని తల్లిగాని కుటుంబ పెద్ధ ఆధ్యాత్మికం విషయానికొస్తే ఓర్పు కుటుంబపెద్ధ ఎవరినైనా రక్షిస్తుంది. తొందరపాటు ఉండకూడదు. కష్టాలొచ్చినప్పుడూ ఓర్పుతో ఉండటం మంచిది. క్షమాగుణాన్ని తల్లితో పోలుస్తారు. ఓర్పునకు మారుపేరుగా భూమాతను చెబుతారు. ప్రతి ఒక్కరినీ భూమి మాతృమూర్తిలా లాలిస్తుంది. ఎవరైతే ఆధ్యాత్మిక కుటుంబం కలిగిఉంటారో, వారు దేనికీ భయపడనవసరం లేదు. ఓర్పు, క్షమాగుణం కలిగినవారు, ముఖ్యంగా ఏ తప్పూ చేయనివారు దేనికీ భయపడకపోగా ఒత్తిళ్లకు దూరంగా ఉంటారు.
శాంతి ఒక తోడూనీడలా ఉంటుంది. అందుకే ఆనందం ప్రశాంతత... సత్యం కొడుకు... ఈ ప్రపంచంలో రక్షించేవి, సమస్యల్లో చిక్కుకోకుండా చూసేవి... కరుణ, అహింస సోదరీమణులు. ఇవి కలిగిఉన్నవారు మానసికంగా, శారీరకంగా, కనీసం వాక్కు ద్వారానైనా ఎవరికీ హాని తలపెట్టరు. మానసిక నియంత్రణశక్తి సోదరుడు. సోదరుడు ఎన్నో విషయాల్లో అండగా నిలుస్తాడు. నియంత్రణ లేని మనసు అనేక సమస్యలకు కారణమవుతుంది. అలాగే ఇంద్రియాల విషయంలోనూ వీటిని అదుపులో ఉంచుకుంటూ ఉపయోగించుకునే కళను అలవరచుకోగలిగితే అధైర్యం దరిచేరదు. ఇలా ఆధ్యాత్మిక కుటుంబం కలిగినవారు గొప్ప సంపన్నులు, అదృష్టవంతులు .
భౌతిక కుటుంబం ఒక్కటే కలిగిఉండి, ఆధ్యాత్మిక కుటుంబం లేకపోతే జీవితంలో బాధలు, ఒత్తిళ్లు ఎదుర్కొనక తప్పదు. ఎందుకంటే- సొంతమనుకునే భార్యా పిల్లలు, సోదరసోదరీమణులు... ఎవరినీ పూర్తిగా విశ్వసించలేని పరిస్థితులు వస్తాయి. కాలానుగుణంగా ఏర్పడిన బంధుత్వాలు, సంబంధాలు... పరిస్థితులు అనుకూలించకపోతే ఎవరికి వారు వదిలేసి వెళ్ళిపోవచ్ఛు కేవలం భౌతిక కుటుంబంపైనే ఆధారపడకుండా ఆధ్యాత్మిక కుటుంబాన్నీ ఏర్పరచుకోవాలి. ఈ రెండు కుటుంబాలను ఎవరు బలంగా కలిగిఉంటారో- వారంత శక్తిమంతులు, అదృష్టవంతులు మరొకరు ఉండరు!

No comments:
Post a Comment