Sunday, December 6, 2020

మంచి మాటలు

సోమవారం --: 02-11-2020 :--
ఈ రోజు AVB మంచి మాటలు

ప్రతి రోజు మన ఆత్మీయులను న్రత్యక్షంగా పలకరించ లేక పోయినా ప్రతి ఉదయం అభిమానంతో పరోక్షంగా ఇరువురి క్షేమాన్ని తెలిపే పిలుపే ఈ శుభోదయం .

ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపవుతుందో , ఎవరి దగ్గర మన బాధలు సగమవుతాయో ఎవరు కలిసినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందో వారే మన ఆత్మీయులు .

కారణం లేని కోపం భాద్యత లేని యవ్వనం గౌరవం లేని బంధం అలంకారణతో వచ్చే అందం శాశ్వతంగా ఉండవు నిలబడవు నిన్ను నిన్నుగా గుర్తించడంలోనే ఉంది నీ గొప్పతనం .

సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు , వారికి మోసం చేసేంత తెలివి లేదు మర్చిపోయేంత బలము లేదు అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడటమే తెలుసు . ప్రశ్నించే తత్వం పెరిగేకొద్దీ నిన్ను అసహ్యించుకునే శత్రువుల సంఖ్య పెరుగుతుంది ఇదే జీవిత సత్యం.

ఈ ప్రపంచంలో చాలా సులభమైనది మరియు చాలా కష్టమైనది ఏమిటో తెలుసా ! తప్పు ఒకరు చేస్తే చెప్పడం చాలా సులభం మనం చేస్తే ఒప్పుకోవడం చాలా కష్టం

ఏమిచేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావు అని అడగండి సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి పని ఉన్నప్పుడు కాకుండా పనికట్టుకుని మాట్లాడండి పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నెనున్నాననే భరోసా ఇవ్వండి .

జీవితమే ఒక పయనం ఆ పయనంలో కలిసే ప్రయాణీకులు ఎందరో కానీ ఏదీ ఎవరూ శాశ్వతం కాదు కేవలం నువ్వే శాశ్వతం నీ నడవడికే శాశ్వతం గెలిచేది నువ్వే ఓడేది కూడా నువ్వే గెలుపుకి పొంగిపోకుండా ఓటమికి కృంగి పోకుండా ధర్మ బద్థంగా ఫలాపేక్ష లేకుండా తోటివారికి సాయపడుతూ సాగిపోవడమే జీవితం అదే నీ కర్తవ్యం

సేకరణ *మీ ✒️...AVB సుబ్బారావు
📞9985255805
🌸🌷🌹🕉️💐🤝🕉️🛕🌻🌞

Source - Whatsapp Message

No comments:

Post a Comment