Friday, January 1, 2021

అసలైన క్రొత్త సంవత్సరం

💫అసలైన క్రొత్త సంవత్సరం ⏰

హాపీ న్యూఇయర్ అనే మాట వినగానే మనలో చాలామందికి మనసులో మెదిలేది జనవరి 1వ తేదీ. సంవత్సరారంభం అనగానే చాలామందికి అదే గుర్తుకు వస్తుంది గాని, శాస్త్రీయమయిన సంవత్సరారంభం ఉగాది (యుగాది) గుర్తుకు రాదు.

ఉగాది (యుగాది) అంటే మనకు గుర్తుకు వచ్చేది కేవలం వేప పువ్వు పచ్చడి తినే పండుగ.

ఖగోళశాస్త్రరీత్యా ఏ ప్రత్యేకతా లేని జనవరి 1వ తేదీని సంవత్సర ఆరంభముగ భావించి మన ఉగాది (యుగాది) ప్రాశస్త్యాన్ని మరచిపోవడం చాలా దురదృష్ఠకరం.

ఆంగ్ల సంవత్సరాన్ని విడిచిపెట్టి ప్రపంచానికి ఎదురీదమని ఎవ్వరూ చెప్పరు, కాకపోతే ఖగోళ శాస్త్రపరంగా నిర్ణయించబడిన ఉగాది (యుగాది)ని అసలయిన సంవత్సరారంభముగ గుర్తించి పండగ జరుపుకోవాలని ఆశిస్తున్నాము.

భూమి వాతావరణానికి అవతల వ్యాపించియున్న అనంత విశ్వాన్ని అంతరిక్షం అంటారు. గ్రహాలతో కూడిఉన్న ఆ అంతరిక్షాన్ని ఖగోళం అంటారు.

భూమి ఒక ఆత్మప్రదక్షణచేస్తే 1 రోజని, చంద్రుడు ఒక భూప్రదక్షణచేస్తే 1నెల అనీ, భూమి ఒక సూర్యప్రదక్షణ చేస్తే 1 సంవత్సరమని ఇలా కాలమానాన్ని ఖగోళ ఆధారముగానే లెక్కిస్తున్నారు కదా. మరప్పుడు సంవత్సారారంభం కూడా ఖగోళాధారముగానే ఉండాలనేది దీన్నిబట్టి అర్ధమవుతోంది.

సంవత్సరం అనేది కాలమానములో ఒక అంశం. నక్షత్రాల, గ్రహాల ఉనికీ, చలనాలను బట్టి ఖగోళ శాస్త్రపరంగ కాలమానం ఏర్పడిందికాబట్టి సంవత్సర ఆరంభానికి కూడా ఖచ్చితంగ ఒక ఖగోళ ప్రత్యేకత ఉండాలికదా.

మరి డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి సమయములో ఖగోళపరముగ ఎటువంటి మార్పులు లేనప్పుడు, శాస్త్రపరమయిన ఉగాది (యుగాది)ని మరచి, కొందరు పాశ్చాత్స్య సంస్కృతిని అనుకరించాల్సిన అవసరము లేదుకదా !?

ఊరంతా ఒక దారయితే ఉలిపికట్ట ఒక దారి అనేట్లుగ ఉండనవసరము లేదు. కాకపోతే జనవరి 1అనేది సంవత్సరానికి మొదటి రోజు కాదనేది గుర్తుంటే చాలు. కాలగణనలో ఉగాది (యుగాది)ని మర్చిపోకూడదు.

ప్రపంచానికి మొట్టమొదటగా కాలగణనం నేర్పింది మన భారతీయులే. కాలక్రమేణ విదేశీయుల దండయాత్రలతో మన పూర్వ చరిత్ర మెల మెల్లగా కాలగర్భములో కలిసిపోయి, విదేశీయుల దౌర్జన్య పరిపాలనలో భారతీయులు తమ ప్రభవాన్ని చాలా కోల్పోయి, సంస్కృతిని, సాంప్రదాయాలను విస్మరిస్తున్నారు.

మన భారత జాతి ప్రాచీన ఔన్నత్యాన్ని ఒప్పుకోలేని, జీర్ణించుకోలేని పాశ్చాత్యులు సింధు నాగరికతకంటే గ్రీకు, చైనా, పర్షియా మొదలగు వారి నాగరికతలే ప్రాచీనమయినవని తప్పుడు చరిత్రను, ఆర్యులు, ద్రావిడులు, దండయాత్రలని, వ్రాసిన కల్ల బొల్లి చరిత్రలను మనమీద రుద్దారు, అవి చదివిన మనం ఎంత చెప్పినా బయటకు రాలేనంతగా జీర్ణించుకున్నాము.

ప్రపంచ విజ్ఞానానికి పునాది మన సింధు నాగరికతే. దీని ప్రాచీనతను కనుగొనటం ఎవరి తరమూ కావటములేదు. మన విజ్ఞాన గ్రంధాలు వేదాలు. ఋగ్వేదకాలము నుండీ కాలగణనం ఒక్క మన భారత జాతికే చెల్లింది. అట్టి ప్రాధాన్యతగల ప్రాచీన విజ్ఞాన్ని అమెరికాలోని నాసా వారుకూడా మొన్న రామసేతు ఉన్నదని నిర్ధారించిన దానితో తెలుస్తున్నదికదా !

జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు కేవలం అంకెలను లెక్కించుకోవడం తప్ప ఏ తేదీన ఖగోళ పరిస్థితి ఎలా ఉన్నదీ తెలిపే విధానం ఏమీలేదు. అదే మన పంచాంగం చూస్తే ప్రతిదీ ఖగోళపరంగానే తిధి, వారం, నక్షత్రం, యోగం కరణం లెక్కకట్టబడియుంటుంది.

ఇప్పటికీ ప్రపంచములో ఏదేశమూ ఖగోళ శాస్త్రములో మనలను మించిన వారు లేరు. అంత శక్తి సామర్ధ్యాలతో కూడిన, విశిష్ఠమయిన విజ్ఞానం మనదగ్గర ఉంది. దీనిని మరువకూడదు.

కాలమానం - ఖగోళపరముగా..

అసలు కాలాన్ని లెక్కించటములో విదేశీయులకు ఒక అవగాహనలేకపోవటం అనేది ఒక రోజును లెక్కించటములోనే స్పష్ఠముగ తెలుస్తుంది.

విదేశీయుల ప్రకారం అర్ధరాత్రి 12 గంటల నుండి మళ్ళీ అర్ధరాత్రి 12 గంటల వరకూ ఉన్న కాలాన్ని ఒక రోజు. కాస్త ఆలోచిస్తే ఇది ఎంత తికమకగా ఉన్నదో తెలుస్తుంది చూడండి.

జనవరి నెలలో మొదటి రోజు 1వ తేదీ అనగా డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత వచ్చే రాత్రి భాగము+జనవరి 1వ తేదీ పగలు భాగము+జనవరి 1వ తేదీ సూర్యాస్తమయం నుండి అర్ధరాత్రి 12 గంటల వరకూ ఉండే రాత్రి భాగము. ఈ మూడు భాగాలు కలిపి 1 రోజుగ లెక్క.

రోజు అనేది కాలమానములో ఒక అంశం కాబట్టి ఖగోళపరముగ నిర్దిష్ఠంగ ఉండాలి.

జనవరి 1వ తేదీ రాత్రి సమయం అంటే అది ఏ రాత్రి సమయము ?

డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తరువాత వచ్చే రాత్రా, లేదా జనవరి 1వ తేదీ సూర్యాస్తమయం తరువాత వచ్చే రాత్రి భాగమా ?

ఈ తికమకకు తప్పనిసరిగ మనం టైం చెప్పవలసి వస్తుంది.

మన సనాతన భారతీయ కాలమానములో ఒక రోజును ఖగోళ శాస్త్ర ప్రకారముగ సూర్యోదయము నుండి మళ్ళీ సూర్యోదయం వరకు గడచిన కాలం. సూర్యోదయముతో మొదలయి 1 పగలూ, 1రాత్రి కలసి 1 రోజుగ చెప్పడములో ఒక నిర్ధిష్ఠత ఉంది.

విదేశీయుల ప్రకారం అర్ధరాత్రి 12 గంటలకు రోజు మారుతుందని.

అర్ధరాత్రి 12గంటల సమయములో ఖగోళములోగానీ, భూగోళం మీదగానీ ఎటువంటి మార్పు జరగదు. ఎటువంటి ప్రత్యేకత గోచరించదు.

మనం తయారుచేసుకున్న గడియారాల్లో అంకెలపై ముళ్ళు ఏమార్పూ పొందకుండా కదులుతూనే ఉంటాయి. కాలం అలా మామూలుగానే గడుస్తూ ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటలు కొట్టగానే రోజు మొదలయినదని లెక్కిస్తారు.

మనమలా కాదు. భూమిపై వెలుగునిండే సూర్యోదయం కార్యక్రమంతో దినారంభం అవుతుంది.

అంతే గాని, మనం నిర్మించిన గడియారం 12 గంటలు కొట్టగానే రోజు మారుతుందా ?

అలాగయితే, ఒక వేళ గడియారం అర్ధరాత్రి 12 గంటలు కొట్టకముందే ఆగిపోతే మరి రోజు మారకుండా ఆగిపోతుందా?

ఒకసారి ఆలోచించాలి!

ఇంత గొప్ప శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానాన్ని యూరోపియన్లు మతంతో ముడిపెట్టి, మనల నుండి వేరుచేసి, వారుమాత్రం అదే పరిజ్ఞానాన్ని ఒక విజ్ఞాన భాండాగారంగా స్వీకరించి తద్వారా వారి దేశాభివృద్ధి కోసం ఉపయోగించుకోవడమే కాకుండా పూర్తిగా వారి జీవనశైలిలో కలుపుకున్నారు. దీనిని మనంకూడా మత పరముగా కాకుండా జ్ఞాన సంపదగ తిరిగి గుర్తించిన రోజున దేశాభివృద్ధి ద్విగుణీకృతం అవ్వగలదని ప్రతి భారతీయుడు విశ్వసిస్తున్నారు.

ఖగోళ శాస్త్రములో విశ్వవిజేయతలయిన మన ప్రాచీన భారతీయ శాస్త్రజ్ఞులు ప్రపంచానికిచ్చిన, వెలకట్టలేని శాస్త్రీయమయిన జ్ఞానాన్ని అందిపుచ్చుకుందాము, వాటిని శాస్త్రీయముగ ఆచరిద్దాము, ఆచరిస్తూ అవతల ఉన్న జ్ఞాన సంపదను కూడా స్వీకరిద్దాము 🙏.

ఋగ్వేదములో చెప్పబడినట్లుగ आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः(Let noble thoughts come to us from every where).

{ఆధారం : భారతీయ శంఖారావం 2 నుండి}

1. NASA congratulates Indian astronomers on Star Galaxy discovery(https://www.hindustantimes.com/india-news/nasa-congratulates-indian-astronomers-on-star-galaxy-discovery/story-oO14PDzhz8W7cQqIMKgHXK.html)

2. Indian astronomers discover one of the farthest star galaxies in universe(https://www.livemint.com/science/news/indian-astronomers-discover-one-of-the-farthest-star-galaxies-in-universe-11598965622776.html)

3. The Origin of the 28 Naksatras in Early Indian Astronomy and Astrology(https://ui.adsabs.harvard.edu/abs/2018InJHS..53..317J/abstract) https://www.ted.com/talks/rajvedamofancientstar gazersandstoryspinners

....and many more...._

🙏🇮🇳😷🌳🏵️🌐🤺🥀

Source - Whatsapp Message

No comments:

Post a Comment