Saturday, January 2, 2021

సేవ - పత్రీజీ సందేశము

Life Change Messages Every Day 6:50pm In Light Workers Group

🙏 సేవ - పత్రీజీ సందేశము 🙏

♻️సేవ అనే తెలుగు పదం 'స' మరి ఏవ అనే రెండు సంస్కృత పదాల కలయిక.

'స' అంటే అతడు లేక అది. 'ఏవ' అంటే మాత్రమే.అనగా నేను అనేది లేకుండా చేసేదంతా సేవ.

♻️సేవచేయాలను కునేవారు ముందుగా తమ రూపుని మార్చుకోవాలి. తమని తాము జీరో చేసేసుకోవాలి.

♻️అహంకారం, మమకారం అన్నవి ఉన్నంతవరకూ సేవ అనేది అసంభవము.

♻️అహంకారము అంటే నేను అనే స్పృహ. మమకారము అంటే నాది అనే స్పృహ.ఈ రెండూ కూడా అంతరించిన్నప్పుడే సేవ అనేది సాధ్యపడుతుంది.

♻️ధ్యానం చేసి ఆత్మజ్ఞాని గా మారిన తరువాతే సేవ అనేది సాధ్యపడుతుంది.
అంతవరకూ మనం చేసేది... చేస్తున్నాము అనుకునేది సేవ కాదు ఇతరుల నుండి తిరిగి రకరకాల అయినవి రాబట్టుకోవడానికి ఏర్పాటు చేయబడ్డ వ్యాపారం మాత్రమే.

♻️సేవ ద్వారా మాత్రమే అసలు సిసలైన ఆనందం మరియు ఎడతెగని ఆనందం ప్రారంభమవుతుంది.

♻️జ్ఞాన సముపార్జన తరువాత మన పట్ల ఏ భావనతో అయితే మనం కార్యాలు నిర్వహిస్తూ ఉంటామో అవే భావనలతో ఇతరుల పట్ల సైతం కార్యక్రమాలు చేస్తుంటాము.

♻️ఇతరుల పట్ల ఏ భావనలతో అయితే కార్యక్రమాలు జరుపుకుంటున్నామో మన పట్ల కూడా అదే భావనతో కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాము.

♻️అంతా అద్వైతం అయిందన్నమాట. నువ్వు నేను అనే రెండు మాటలు కాక అంతా ఏకమైంది అన్నమాట.

♻️సర్వ ప్రాణి పట్ల సమాన ఆదర భావాన్ని కలిగి ఉంటూ... ఆ సమాన ఆదర భావనలోనే సర్వ కార్యక్రమాలు న్యాయబద్ధంగా.. పక్షపాత రహితంగా.. సర్వుల శ్రేయోభిలాషులా.. ప్రజ్ఞ, కరుణ సమ్మేళనంతో జరుపుతూ ఉండడమే సేవాతత్పరత అనిపించుకుంటుంది.

♻️మానవుడి ప్రగతి పథంలో పరమపద సోపానమే సేవ.



ఆధ్యాత్మిక పుస్తకాలు, పిరమిడ్స్, భారతదేశం, ఇతర దేశాలకి కూడా కావాలి అంటే కొరియర్ చేయబడును. సంప్రదించండి 9032596493, 9491557847

లైట్ వర్కర్స్ గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి whatsup మెస్సేజ్ చేయగలరు.
+91 97518 98004

👍 VicTorY oF LiGhT🎇

💚🔆 Light Workers---- 🔄♻🔁 Connected with Universe💓🌟🌕✨💥☣

Source - Whatsapp Message

No comments:

Post a Comment