Friday, January 1, 2021

*"భౌతిక విధి" (Physical Destiny)*

🟢 పితామహ పత్రీజీ 16-09-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢

🔹 "పిరమిడ్ వ్యాలీ", "బెంగుళూరు "🔹
🔸 16-09-2020🔸

Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.

"భౌతిక విధి" (Physical Destiny)

"ఒక వ్యక్తి హత్య, దొంగతనం, లేక మోసం చేయాలి అని ప్రణాళికాబద్ధంగా, ఉద్ధేశ్యపూర్వకమైన ఆలోచనలు కలిగి లేకుండా హత్యకు పాల్పడటం, దొంగిలించటం లేక కపటముతో వ్యవహరించడం చేయడు."

"హత్యలు, దొంగతనాలు లేక కామానికి సంబంధించిన ఆలోచనలు ఉన్నవాడు, ఆ ఆలోచనలకు క్రియారూపం ఇవ్వటానికి మార్గం కనుక్కుంటాడు."

"ఇటువంటివి చేయటానికి పిరికి స్వభావం కలిగి వుంటే, అతను ఇతరుల ఆలోచనలకు ఎర కాబడి, లేక అదృశ్యరూపంలో అంటే గుర్తించలేని విధంగా, తన ఇష్టానికి వ్యతిరేకంగా, ఏదో ఒకానొక క్లిష్టమైన సమయంలో తన ఆలోచనల యొక్క తీవ్ర ప్రభావానికి గురయ్యి మెదడులో ఆ చర్య పట్ల ఉన్నటువంటి కోరిక పురికొల్పగా, ఆ పని చేయటానికి ప్రేరేపింపబడతాడు."

"అదే విధంగా, మంచి పనులు, మర్యాద, మృదు స్వభావం, సేవా దృక్పదం, కృతజ్ఞతా భావం అనేవి ఎక్కడో గాలిలోనుంచి పుట్టుకురావు, ఆ రకమైనటువంటి నిరంతర ఆలోచనా స్రవంతి ద్వారా ఆ పనులలో వ్యక్తమవుతాయి."

"క్లిష్టమైన సమయంలో బలహీనత మరియు సంశయం చోటు చేసుకున్నప్పుడు, ఇతరుల ఆలోచనలు మరియు స్నేహపూర్వకమైన ప్రభావాల ద్వారా తను ఆదర్శవంతమైనదని తలచిన ఆ రకమైన చర్యను చేయడానికి తనని పురికొల్పుతుంది."

"భౌతిక తలంలో ఉన్న ప్రతీదీ ఆలోచన యొక్క బాహ్యీకరణమే, ఇది ఆలోచన చేసిన వ్యక్తి ద్వారా సమత్వం పొంది, అతని బాధ్యతకు అనుగుణంగా మరియు ప్రదేశం, పరిస్థితి, సమయం కూడి వచ్చినప్పుడు సంభవిస్తుంది. ప్రతి సందర్భంలోను - ఇదే చట్టం."

" విధి మరియు శాసనం భౌతిక తలాన్ని దాటి వెళ్ళవు."

"కొన్ని సైకిక్ (శారీరక + మానసిక) ఫలితాలు అనివార్యం, సుఖం లేక దుఃఖం వంటివి ; మానసిక ఫలితాలు అనిశ్చితమైనవి. ఎందుకంటే అవి మానసిక దృక్పధం పై ఆధారపడి ఉంటాయి."

💖 ఎస్. పత్రి 💖

తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)

లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004

👍 VicTorY oF Light 🎇

💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment