నేటి ధనానుబంధాలు
సమాజంలో రూపాన్ని చూసి మోసపోవడం, రూపాయిని చూసుకుని గర్వపడిపోవడం చూస్తుంటాం. మనిషిని డబ్బు మార్చకపోయినా, అతడి నిజస్వరూపాన్ని బయటపెడుతుంటుంది. డబ్బు మనిషిని ఎంతో ఎత్తుకు తీసుకెడుతుంది. కీర్తి ప్రతిష్ఠల రుచి చూపిస్తుంది. ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. ఆ డబ్బే మనిషిని పాతాళంలోకీ నెట్టేస్తుంది. యుక్తవయసులో ఉన్నప్పుడు డబ్బే చాలా ముఖ్యమైనదనిపిస్తుంది. వృద్ధాప్యంలో అదేమిటో అర్థమవుతుంది అంటారు రచయిత ఆస్కార్ వైల్డ్.
ఓ వ్యాపారవేత్త తన గోదాముకు తీసుకెళ్లాడు మిత్రుణ్ని... చూసేందుకు ఏముంటుంది, విశాలమైన ప్రదేశం. బోలెడంత సరకు నిల్వ చేసి ఉందక్కడ. చిందరవందరగా బస్తాలు పడి ఉన్నాయి. అంత శుభ్రంగా కూడా ఏం లేదు. అక్కడ ఓ శ్రామికుడు నేల మీద తల కింద చేయి పెట్టుకుని హాయిగా నిద్రపోతున్నాడు. వీళ్ల రాకను గమనించే స్థితిలో అతడు లేడు. అతణ్ని చూపించి ఆ వ్యాపారవేత్త ‘మిత్రమా, నాకు ఇతణ్ని చూస్తే చాలా అసూయగా ఉంది. ఖరీదైన భవంతిలో పట్టుపరుపులపై పడుకున్నా, నేనెప్పుడూ ఇలాంటి నిద్రసుఖమెరుగను’ అన్నాడు. డబ్బున్నంత మాత్రాన సుఖం ఉంటుందనుకోవడం పొరపాటు.
డబ్బును సవ్యంగా ఖర్చు చేసినప్పుడు వ్యక్తికి తృప్తి, ఆత్మానందం కలుగుతాయి. అదే ఆడంబరాలకు పరిమితమైనప్పుడు డబ్బు వృథా అనిపిస్తుంది. డబ్బు లేదన్న నిజాన్ని కనీసం నీడకైనా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీడ కూడా ఆలోచనలో పడుతుందంటారు అనుభవజ్ఞులు.
దైవం పట్ల విశ్వాసం, మంచితనం పట్ల నమ్మకం లేనప్పుడు సహజంగానే మనుషులు అసంతృప్తితో జీవిస్తారు. అభద్రతా భావానికి గురవుతుంటారు. ఆ బాధలకన్నింటికీ కారణం డబ్బు లేకపోవడమేనని చింతిస్తుంటారు. డబ్బు గల వారందరినీ శత్రువులుగా చూస్తుంటారు. శ్రమను, ధనాన్ని గురువుకు సమర్పించుకున్నప్పుడు దాన్ని ‘దక్షిణ’ అంటాం. దానికి విలువ కట్టలేం. ఈ ‘దక్షిణ’ ఆశీస్సుల రూపంలో తిరిగి వస్తుంది. అది సంతోషం, సంతృప్తి, సమృద్ధిని తీసుకొస్తుంది. ‘ఇంతకంటే ఏం కావాలి’, ‘ఉన్నది చాలదా’ లాంటి భావనలు మనిషికి కలుగుతూనే ఉంటాయి. చిత్రమేమిటంటే- అవి స్థిరంగా ఉండకుండా, వచ్చి మెరుపులా మాయమవుతుంటాయి. మళ్ళీ బుద్ధి బురదగుంటలో పడుతుంది. మనిషి తాపత్రయాల్లో చిక్కుకుంటాడు.
డబ్బు అనేది ఒక ఉపకరణం. సక్రమంగా వినియోగిస్తే అందాలను, అద్భుతాలను సృష్టిస్తుంది. పట్టాలు తప్పితే గందరగోళమే. మనిషి తాను డబ్బు విషయంలో ఎంత గొప్పవాడో తెలుసుకోవాలంటే జీవితంలో డబ్బుతో కొనలేనివి ఏమిటో, ఎన్ని ఉన్నాయో ముందు తెలుసుకోవాలి. ఆ విచక్షణ కలిగి ఉంటే అతడి దగ్గర ఎంత డబ్బున్నా సమాజానికి మేలేగానీ ఏ నష్టమూ ఉండదు. మనిషి చేతుల్లో డబ్బుంటే తానేమిటన్నది మరచిపోతాడు. అది లేకపోతే... అతడేమిటన్నది ప్రపంచం గుర్తుంచుకోదు. దీనివల్లే సమస్య. కానీ, వివేకం గలవారు డబ్బుమాయలో చిక్కుకోరు.
ఎంత ధనం మూలుగుతున్నా, కడుపు నింపేది పిడికెడు మెతుకులేనన్న సత్యం తెలిసినా, పక్కదారి పట్టించే ఆలోచనలకు కళ్లెం వేయలేని బలహీనతలోంచి మనిషి బయటపడాలి.
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment