Tuesday, May 31, 2022

🙏మనోజయం

🙏మనోజయం

రెండు మార్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి నీ మనసు ఆధీనంలో నువ్వు ఉండటం లేదంటే నీ ఆధీనంలోకి నీ మనసును తెచ్చుకోవడం తనదే పై చేయిగా ఉండాలని, ప్రతీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది మనసు. చివరికి అదే గెలుస్తుంది. మనం ఓడిపోతాం. గెలవడం మనసుకు అలవాటు ఓడిపోవడం మనకు అలవాటు. ఓడి, గెలిచామనుకుంటూ కొంతమంది సంతృప్తి పడుతూ ఉంటారు. ఆ అవకాశం మనకు ఇచ్చేది మనసే

మనసును గెలిచినవాడి ముఖం దివ్య తేజస్సుతో వెలిగిపోతుంది. మనసును నేల కనిపించినవాడి నడవడిక నిండుకుండలా తొణక్క బెణక్క ఉంటుంది. మనో నాశనం అయినవాడి ముఖం భగవద్గీత చెప్పిన ఉత్తమమైన యోగిలా ఉంటుంది. మనలో ఉండి, మనతో పోరాటం ఈ మనసుకు... అదే గమ్మత్తు శత్రువు ఎక్కడో ఉండడు. లోపలున్నవాడిని గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్లే తొందరగా తేల్చుకోవాలి. మనసు

చెప్పినట్లు వింటే అరిషడ్వర్గాలకు ఆహుతి అయిపోతాం. లేదంటే మనసునే మచ్చిక చేసుకోవాలి. చితిలోని కట్టెను తీసుకుని, ఆ చితినే తగలబెట్టినట్లు మనసుతోనే మనసును నాశనం చెయ్యాలి.

ప్రపంచానికి వేదిక మనసే. ఇక్కడ ఆడినన్ని నాటకాలు ఎక్కడా ఎవరూ చూడరు. నిత్యం ఈ రంగస్థలం: ఖాళీగా రకరకాల భావోద్వేగాలతో నిండిపోయి, కుట్ర కుతంత్రాలతో మరిగిపోయి, రాగ ద్వేషాలతో, ఆశాపాశాలతో వేయి. పడగల సర్పంలా బుసలు కొడుతూ ఉంటుంది.

చాలా భీకరంగా, బీభత్సంగా, భయానకంగా ఉన్నత్తంగా ఉండే ఈ మనసును కూడా లొంగదీసుకునే రాజయోగి ఒకడున్నాడు. వాడు. మనిషే వాదెన్నడూ వెనకడుగు వెయ్యలేదు. రణమో, రాజనమో అంటూ పోరాడుతూనే ఉన్నాడు.

అంతర్యామి

మనసును ఆధీనంలోకి తెచ్చుకునే దానితో సర్వకార్యాలు నెరవేర్చుకోవాలి. మనసు లేకపోతే మౌనాన్ని ఆశ్రయించాలి. కొండ మీద కూర్చోవాలి. శీతోష్ణ సుఖదుఃఖాదులను ఓర్చుకోవాలి. సంసార సముద్రాన్ని దాటేశానని సంతోషపడాలి. వద్దు వద్దు. అన్నీ ఉండగా, అందరితో ఉండగా, మనసును రళ్లెం వేసి పట్టుకుంటూనే ఈ బతుకు తీరం దాటాలి అంటాడు కబీర్ ఇది సంతోషం కలిగించే విషయం. కోట బయట యుద్ధం కంటే కోట లోపల యుద్ధం సురక్షితం అంటారు రామకృష్ణ పరమహంస..

ఇలా అందరూ చెయ్యగలరా? చెయ్యలేదు. అయినా తప్పదు. మనసు ఆధీనంలోకి మనం వెళుతున్నట్లు నటించి మన ఆధీనంలోకి దాన్ని తెచ్చుకోవాలి. ఆ విషయాన్ని మనసు పసిగట్టకుండా చూసుకోవాలి. ఆ నైపుణ్యం మనకుండాలి. జీవితమంతా మనసుతో ఆడే అటే. ఇలాంటి రంజుగా ఉండే ఆట లేకపోతే బతుకు ఎంతో చప్పగా ఉంటుందనేమో భగవంతుడు మనిషికి మనసిచ్చాడు. ఆ మనసే అంతులేని శిక్షగా మారిపోయింది. మనసే బంధకారకం. మనసే మోక్ష కారకం అంటున్నాయి ఉపనిషత్తులు, అంటే ఎంతో చెడు చేసినా, చివరికి ఈ భవబంధాల్లోంచి విడగొట్టేది మన సేనన్నమాట. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు మనసు ఏదైనా చెయ్యగలదు. మంచిగా మనసుతో వ్యవహరిస్తూ అదుపు

చేసే సామర్థ్యం పెంచుకోవాలి. మనం ఒక ఎత్తు చేస్తే, అది మరో ఎత్తు వేస్తుంది. ఈ చదరంగ క్రీడ ఎప్పుడు ఎలా ముగుస్తుందో కాలమే నిర్ణయించాలి. అయితే పట్టుదల గల మనిషిని విజయం వరించకుండా ఉండదు!
ఆనందసాయి స్వామి

సేకరణ

No comments:

Post a Comment