Forwarded message
ఇవేమి చదువులు ? 🫣🤔
స్కూల్ పిల్లలు ఇంటికొచ్చాక హోమ్ వర్క్ చేస్తారు . హోమ్ వర్క్ అంటే ఇంటి పని . నిజానికది ఇంటిపని కాదు . చదువుకు సంబంధించింది .. స్కూల్ పని .
పిల్లలు ఇంటకొచ్చాక చదవాలి . రాయడం ప్రాక్టీస్ చేయాలి . నిజమే కానీ ..
1 . యూకేజీ పిల్లాడు.. కొన్ని పదాలు ఇచ్చి ఒక్కో దాన్ని పదేసి సార్లు రాయమన్నారు . ఇదే హోమ్ వర్క్ . మాంగో అనే పదం . MANGO 🥭అని ఒక్కో సారి.. మొత్తం పది సార్లు పదం రాయాలి . కానీ ఆ పిల్లాడు... M , M అంటూ కిందకు కిందకు పది సార్లు రాసాడు . తరువాత A , A అని M పక్కనే పది సార్లు. ఇలాగే మొత్తం MANGO అనే పదాన్ని రాసాడు . అలాగే మొత్తం పదాలు రాసాడు . హోమ్ వర్క్ పూర్తయ్యింది . ఇప్పుడు ఆ పిల్లాడు నేర్చుకొన్నదేంటి ? ఏమీ లేదు . జస్ట్ మెకానికల్ గా రాసేసాడు . స్పెల్లింగ్ రాదు . రాయడం ప్రాక్టీస్ కాదు . హోమ్ వర్క్ తంతు .. పూర్తయ్యింది . ప్రయోజనం సున్నా .
2 . రెండో క్లాస్ అమ్మాయి . రాత్రి హోమ్ వర్క్ పూర్తి చెయ్యాలి . కానీ త్వరగా నిద్ర పోయింది 👩👦. పొద్దునే స్కూల్ వాన్ టైం అవుతోంది . హోమ్ వర్క్ పూర్తి కాలేదు .. "స్కూల్ కు వెళితే టీచర్ కొడుతుంది . నేను వెళ్ళను" అని ఏడుస్తోంది . .. మమ్మీ హోమ్ వర్క్ నోట్ బుక్ తీసుకొని తన కూతురి హ్యాండ్ రైటింగ్ ని అనుకరిస్తూ హోమ్ వర్క్ పూర్తి చేసింది . పాప స్కూల్ కు వెళ్ళింది . టీచర్" గుడ్" అంది . అమ్మ హ్యాపీ .. టీచర్ హ్యాపీ .. అమ్మాయి హ్యాపీ . కానీ నష్టం జరిగింది ఎవరికి ? ఎందుకీ హోమ్ వర్క్ తంతు ?
3 . ఏడో క్లాస్ అబ్బాయి . తెలుగు సబ్జెక్టు . "పర్యావరణం" అనే పాఠం . పది అడవి జంతువుల ఫోటోలు , పది పెంపుడు జంతువుల ఫోటోలు నోట్ బుక్ లో అతికించాలి . అదీ హోమ్ వర్క్ . సెల్ ఫోన్ వీడియో గేమ్స్ ఆడుతూ హోమ్ వర్క్ చేయకుండా నిద్ర పోయాడు . డాడీ ఆఫీస్ నుంచి వచ్చాడు . హోమ్ వర్క్ చూసిన మమ్మీ పక్కన ఉన్న బుక్ స్టాల్ కు వెళ్లి జంతువుల ఫోటోలు ఉన్న పోస్టర్ కొనుక్కొని వచ్చింది . డాడీ దాన్ని కట్ చేసాడు . మమ్మీ హోమ్ వర్క్ బుక్ లో అతికించింది .అసలు తెలుగు పాఠం దేనికి ? తెలుగు విని అర్థం చేసుకోవడం మాట్లాడడం ..చదవడం రాయడం . ఇదీ నేర్పాల్సింది . ఆ బొమ్మలు అతికిస్తే ఏమి వస్తుంది ? ఏడో క్లాస్ పిల్లాడికి పులి, సింహం అడవి జంతువులు ఆవు, మేక పెంపుడు జంతువులు అని తెలియవా ? అయితే గియితే ఇది సైన్స్ పాఠం కావాలి . తెలుగు లో సబ్జెక్టు లో ఈ పాఠం లో నెరపాల్సింది .. { ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో } వైల్డ్ అనిమల్ అంటే అడవి జంతువు.. carnivore అంటే మాంసాహారి .. బయో డైవర్సిటీ అంటే జీవ వైవిధ్యము .. ఇలాంటి విషయాలు కదా ? ఆ పోస్టర్ ఏంటి ? దాన్ని అమ్మ నాన్న కలిసి బుక్ లో అతికిస్తే వచ్చేదేంటి ? ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు ?
ఇలాంటి హోమ్ వర్క్ ఇవ్వరేంటి ?
1 . జరిగిన పాఠాన్ని రెండు సార్లు చదవండి .
2 . రేపు జరగబొయ్యే పాఠాన్ని చదివి అర్థం చేసుకొని టీచర్ లాగా బోధించడానికి ప్రయత్నించండి { రేపటి క్లాసులో }.
3 . ప్రతి రోజు ఆ ఆరోజు మీరు చేసినదాన్ని{ దిన చర్య } డైరీ గా రాయండి . దీని వల్ల రైటింగ్ ప్రాక్టీస్ . అంతకు మించి చక్కటి మెమరీ అవుతుంది ." నేను తొమ్మిదో క్లాస్ లో వున్నపుడు ఇదిగో ఇలా.." అని రేపు మీ కూతురికో కొడుకుకో చూపించవచ్చు అని పిల్లలకు చెప్పరెందుకు ?
3 . మీరు చదువుతున్న క్లాస్ కంటే రెండు మూడు క్లాస్ లు కింద చదువుతున్న మీ పక్కింటి, పై ఇంటి పిల్లలకు ముఖ్యంగా మీ ఇంటి లో పని చేసే ఆయమ్మ పిల్లలు డ్రైవర్ పిల్లలు ఇలాంటి వారికి ఉచితంగా ట్యూషన్ చెప్పండి . ఒక పాఠాన్ని బోధించడమంటే ఆ పాఠాన్ని పది సార్లు చదివి నట్టు లెక్క . ఆ కాన్సెప్ట్ బాగా అర్థం అయిపోతుంది . సమాజ సేవ గా ఉంటుంది అని చెప్పరెందుకు ?
ఇంటి పనికి మరో కోణం :
గుండీ ఊడి పోయింది . దాన్ని ఎలా కుట్టాలి ? షూ పోలిష్ ఎలా చెయ్యాలి ? బట్టలు ఎలా ఉతకాలి ? ఉతికిన బట్టలు ఎలా ఐరన్ చెయ్యాలి ? వంట ఎలా వాడాలి ? ఇల్లు ఎలా శుభ్రం చెయ్యాలి ? ఫ్రిజ్ వాడకం అవసరమే . కానీ అతిగా ఫ్రిజ్ వాడితే నష్టం ఏంటి ? మైక్రో వేవ్ ఒవేన్ తో ఆరోగ్యానికి జరిగే నష్టం ఏంటి ? తల్లి సోదరుడు మామయ్య.. తండ్రి సోదరుడు బాబాయ్ లేదా పెద్ద నాన్న . ఇద్దరినీ అంకుల్ అని పిలవడమేంటి ? పక్కింటి పై ఇంటి వారిని అంకుల్ .. ఆటో అంకుల్ డ్రైవర్ అంకుల్ .. స్విగ్య్ అంకుల్ .. ఇదేంటి ? ఇదేమి ఆచారం ? ఇంటికి వచ్చిన బంధువులకు కుటుంబ మిత్రులకు ఎలా గ్రీట్ చెయ్యాలి ? ఎలా మర్యాదలు చెయ్యాలి ? అసలు మర్యాద చేయడమంటే వారికీ స్వీట్ లు హాట్ లు పెట్టి ఆల్రెడీ ఊబకాయం తో షుగర్ తో బిపి తో బాధ పడుతున్నవారిని మొగమాట పెట్టి అతిగా తినిపించి ఆరోగ్యాన్ని మరో అడుగు చెడగొట్టే దశలో తీసుకొని పోవడమేనా ? పిజ్జా లు బర్గర్ లు .. కాఫీ లు టీ లు .. లడ్లు జాంగ్రీలూ .. మురుకు లు...ఇవేనా అతిథి మర్యాద వంటకాలు ? మజ్జిగ , కొబ్బరి నీరు కొబ్బరి ముక్కలు- బెల్లం ముక్కలు , వేరు శనిగ గింజలు దానితో పాటు డేట్స్ ఇలా ఆరోగ్య కరమైన స్నాక్ ఎందుకు ఇవ్వకూడదు . వీటిని ఎలా తయారు చెయ్యాలి ..ఇలాంటి వాటిని పిలల్లకు నేర్పేది ఎవరు ?
పిలల్లి ఇంటికి రావడం తోటే" రేయ్ హోమ్ వర్క్ చెయ్యి" అని తల్లి వెంటపడడం .. వాడేమో ఎం ఎం ఎం అని మాంగో పదం రాయడం హోమ్ వర్క్ అయ్యాక .. బోర్ .. టీవీ ముందు సెల్ ఫోన్ తో ఆటలు . ఇదీ నేటి సీన్ .
ఇది చదువు కాదు . చట్టబండలు . పోనీ ఇంటి పని అయినా వచ్చా అంటే అదీ రాదు . .
బతకడం నేర్పలేని చదువెందుకు ?
.
ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని రా అని తల్లి చెబితే గుర్రున చూసే పదో తరగతి కూతురు ! బంధువులు వస్తే పట్టించుకోని పిల్లలు .. వంట వార్పూ .. ఇంటి పని తోట పని .. పిల్లలు చేయడమేంటి ? మా ఇంట్లో పని మనుషులు లేరా అనుకొనే తల్లి తండ్రులు ..
ఇంటి పని . కుట్లు - అల్లికలు వంట - వార్పూ, హౌస్ కీపింగ్, అతిథి మర్యాదలు , డబ్బు- దాని విలువ , పొదుపు , ఆదాయం- ఖర్చులు , సమాజం- భాద్యత .. ఇవన్నీ ఒక్కో క్లాసుల్లో పిల్లల ఏజ్ బట్టి నేర్పితే ?.. దీన్నే హోమ్ వర్క్ గా ఇస్తే? .. ఇంటికెళ్లి ఇవన్నీ అవసరాన్ని/ సందర్భాన్ని బట్టి చెయ్యండి . మీ పని తీరు బట్టి మీకు మార్కులు ఇచ్చేది మీ అమ్మ నాన్న అని పాటశాల చెబితే .. తల్లితండ్రుల్ని కూడా హోమ్ గురువులుగా మారిస్తే ?
1 . పిల్లలు బోర్ అనే మాట మరిచిపోతారు . సెల్ ఫోన్ కు, టీవీ కి బానిసలు కారు .
2 . తల్లితండ్రులు- పిల్లల మధ్య సంబంధం మరింత బలపడుతుంది . అమ్మ నాన్న కష్టాన్ని పిల్లలు సరిగా అర్థం చేసుకొంటారు . భాద్యత ఎరిగి పెరుగుతారు . మానసిక పరిణతి వస్తుంది .
3 . పిల్లలో ఊబకాయం రాదు . శారీరిక ఆరోగ్యం దృఢపడుతుంది .
4 . సేవా భావం , సామజిక భాద్యత , శ్రమ పట్ల , శ్రమ జీవుల పట్ల గౌరవం , సహానుభూతి మొదలయిన నాయకత్వ లక్షణాలు పిల్లల్లో ఏర్పడుతుంది . వారి బంగారు భవిత కు బలమైన పునాది పడుతుంది .
హోమ్ వర్క్ నిర్వచనం మారాలి .
తంతు గా హోమ్ వర్క్ ఇవ్వడం వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ . హోమ్ వర్క్ అంటే ఇంటి పని . దీన్ని శాస్త్రీయంగా స్కూల్ లో టీచర్ బోధించాలి . ఇంట్లో ప్రాక్టీకల్స్. ప్రాక్టికల్ చూసి మార్కులు ఇచ్చేది ఆమ్మ నాన్న .. ఇదే రావాల్సిన మార్పు .
చదువంటే మార్కు లు ర్యాంకు లు కాదు . బట్టీ చదువుల వల్ల ప్రయోజనం సున్నా
చదువంటే బతకడం నేర్పేది . చదువంటే రేపటి సంతోషకర జీవనానికి విద్యార్థిని సన్నద్ధం చేసేది .
రండి . మార్పును ఆహ్వానిద్దాం !ఫేసుబుక్ నుండి సేకరించి 🙏

No comments:
Post a Comment