Monday, May 23, 2022

కథ కంచికి మనమింటికి " అంటే ....!!

🎻🌹🙏కథ కంచికి మనమింటికి " అంటే ....!!

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

 "కథ కంచికి మనమింటికి " అంటే ఏమిటో...!!! చిన్నపుడు అర్థమయ్యేదికాదు. కానీ అణుక్షణం అమ్మనే ధ్యానిస్తూ జీవితంలో ముందుకు సాగుతున్నకొద్దీ ఇప్పుడర్థమవుతుంది.   

1) కథ అంటే :-  శరీరాలను మారుస్తూ ఆత్మ చెస్తున్న  ప్రయాణ ప్రయాస 

2) ఇంటికి అంటే :-  మనలో ఉన్న జీవాత్మకు పరమాత్మయే పుట్టినిల్లు .ఆత్మజ్యోతికి పరం జ్యోతియే అసలు ఇల్లు.

3) కాంచీపురి(కంచి) అంటే  :- జీవుడికి మళ్ళీ పుట్టాల్సిన అవసరంలేకుండా ధన్యతను చేకూర్చే  మోక్షపురి. 

 "కథ కంచికి మనమింటికి " అనే మాటకు క్లుప్తసారాంశమిదే :

ఎవరైతే అత్యంత భక్తిశ్రద్ధలతో కంచి కామాక్షితల్లిని దర్శించుకుని తరిస్తారో వారికి మళ్ళీ పుట్టాల్సిన అవసరముండదు.

పునర్జన్మ రాహిత్యాన్నీ పొంది పరంజ్యోతిలో ఐక్యమౌతారు. ఇహంలో సర్వసౌఖ్యాలను అనుగ్రహిస్తూ పరంలో  మోక్షాన్ని ప్రసాదించే కరుణగల తల్లియే "కామాక్షి"..🚩🌞🙏🌹🎻

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

సేకరణ

No comments:

Post a Comment