Tuesday, May 24, 2022

🐜పిల్ల చీమ సందేహం

🐜పిల్ల చీమ సందేహం

ఒక పుట్టలో పుట్టిన బుజ్జి చీమ తొలిసారిగా బయట ప్రపంచాన్ని చూడడానికి వచ్చింది, చెట్లు, చేమలు, పక్షులు, జంతువులను చూడగానే ఆ పిల్ల చీమకు ఆశ్చర్యం వేసింది. వాటి ముందు తాను చాలా చిన్నగా ఉన్నానని బాధ పడింది.

కాసేపటికి పేద్ద ఏనుగు దానికి ఎదురైంది, అదైతే ఏకంగా ఆకాశాన్ని తాకుతున్నట్లే ఉంది, దాన్ని చూడగానే చీమ కళ్లు చెదిరాయి, ఏనుగు తన బలమైన తొండంతో చెట్ల కొమ్మలను విరిచి తినడం విచిత్రంగా కనిపించింది

అలా చూస్తుండగానే, ఓ కోతి ఒక చెట్టు నుంచి మరో చెట్టు మీదకు అమాంతం దూకింది, దానికి దొరికిన కాయలు పండ్లు తింటుంది, ఆ పక్కనే ఓ పేద్ద కొండచిలువ ఏదో జీవిని నోటకరుచుకుని మింగేయడానికి ప్రయత్నిస్తోంది

పిల్ల చీమ సందేహం వచ్చింది, వాటన్నింటిని చూసిన తర్వాత చీమకు తన మీద తనకు మరింత అసహ్యం వేసింది, అబ్బా ! జీవితమంటే వాటిది, నాదీ ఒక బతుకేనా? అనుకొని బాధ పడింది, తనకు వాటిలా బతికే అవకాశం లేకుండా చేసిన భగవంతుడి మీద కొద్దిగా కోపం కూడా వచ్చింది

బయటకు వెళ్లి చాలా సమయమైనా, ఇంకా తన దగ్గరకు రాని, పిల్ల చీమను వెతుక్కుంటూ తల్లి చీమ అక్కడకు చేరింది, తన తల్లిని చూసిన పిల్ల చీమ అమ్మా ! అమ్మా ! అంటూ పిలుస్తూ అక్కున చేరింది పిల్ల చీమ, ఆ జీవులు చూడు ఎంత పెద్దవో, కావాల్సిన ఆహారం చక్కగా తింటున్నాయి, ఛీ ఛీ ఏమిటో, ఈ భగవంతుడు మనల్ని ఇలా పుట్టించాడు అని బాధపడింది ...

తల్లి చీమ, ఇప్పుడేమైందని, అంతలా బాధపడుతున్నావు, అలా అంటావేంటి అమ్మ! మనం, ఆ ఏనుగులా మనం ఘీంకరించగలమా ? సింహంలా గర్జించగలమా ? ఆ పక్షుల్లా కిలకిలరావాలు పలికించగలమా ? ఆ చిరుతపులిలా మెరుపు వేగంతో పరుగెత్తగలమా ? అదిగో, ఆ లేడిలా చెంగుచెంగున గెంతగలమా ?

ఇవేమీ చేయలేం, మనం అని భావవ్యక్తీకరణ చేసింది, పిల్ల చీమను ఎలా ఓదార్చాలో, ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తల్లి చీమకు అర్థం కావడం లేదు, ఎంత చెప్పినా పిల్ల చీమ వినడం లేదు, ఇంతలోనే కొందరు తుపాకులు, విల్లులు, తాళ్లు, కర్రలు, ఇనుప గొలుసులతో అడవిపై దాడి చేస్తూ, అడవి మీద పడ్డారు, దొరికిన జంతువును, పక్షులను, దొరికినట్లు బంధించారు, వాటన్నింటినీ లారీల్లో ఎక్కించుకుని తీసుకుని పోయారు ...

అయ్యయ్యో ! ఎందుకమ్మా !!
ఆ సింహాన్ని, పులిని, కోతిని జింకల్ని, పక్షుల్ని, కొండచిలువల్ని, నక్కల్ని, ఇలా కనిపించిన ప్రతి జీవినీ బంధించుకుని తీసుకొనిపోయారు, ఇంతకీ వాటిని ఏం చేస్తారమ్మా ? అని భయపడుతూ పిల్ల చీమ తల్లిని అడిగింది

వాళ్లు వేటగాళ్లు అమ్మా, ఇప్పుడు బంధించిన జీవుల్లో కొన్నింటి గోర్లు, చర్మం తీసి ఉపయోగించుకుంటారు, మరికొన్నింటిని సర్కస్‌ వాళ్లకు అమ్మేస్తారు, ఆ సర్కస్‌ వాళ్లేమో వాటితో వెట్టి చాకిరి చేయించి, ఆటలాడించి సొమ్ము చేసుకుంటారు, అవి చచ్చిపోయేంత వరకూ పాపం బందీగా బతకాల్సిందే, అని చెప్పింది తల్లి చీమ

అమ్మా, మరి వాళ్లు మనల్ని ఎందుకు బంధించలేదు ? అని పిల్ల చీమ అమాయకంగా అనుమానం వ్యక్తం చేసింది, మనతో వాళ్లకేం పని ఉండదు, అసలు వాళ్ల దృష్టి మన మీద పడితేగా, కావాలని చూస్తే తప్ప మనం మనుషులకు కనిపించంగా, అదే మనకు రక్షణ అంది, తల్లిచీమ

అయ్యో దేవుడా ! నిన్ను అనవసరంగా నిందిచను, నన్ను చీమలా పుట్టించి నాకు ఎంతో మేలు చేశావాని, మనసులో సంతోషంగా కృతజ్ఞతలు చెప్పుకుంది, చిన్న చీమ ..
కావున ఆ సృష్టికర్త ఏదిచేసినా మన మంచికే అన్న భావనతో ఆనందంగా జీవితాన్ని కొనసాగించుదాం.

ఉషోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment