🕉హరి ఓం 🙏 శ్రీలత సేకరణ
* సభ్యులందరికి శుభోదయం*
భగవంతుడు ఎలా ఉంటాడు🙏
ఒక పట్టణంలో ఒక స్త్రీ నివసించేది, ఆమె ప్రతిరోజూ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయనను ప్రత్యక్షంగా కలవాలని కోరుకుంటూ ఉండేది. ఆమె ఎప్పుడూ భగవంతుని రూపాన్ని గురించే ఆలోచిస్తూ ఉండేది.
ఒకరోజు నిద్రకు ఉపక్రమించే ముందు భగవంతుడిని చాలా శ్రద్ధగా స్మరించుకుంది. ఆ రాత్రి భగవంతుడు కలలో కనిపించి మరుసటి రోజు ఆమెను కలుస్తానని వాగ్దానం చేశాడు. మరుసటి రోజు ఉదయం ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే స్వామికి స్వాగతం పలికేందుకు సంసిద్ధమైంది.
ఇంటిని శుభ్రం చేసి, కన్నులపండువగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టింది. తర్వాత ఆమె తన ప్రభువుకు రుచికరమైన ఆహారాన్ని తయారుచేయడం ప్రారంభించింది.
మిఠాయిలు చేస్తుండగా ఎవరో తలుపు తట్టారు. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీసింది. పత్రికలను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఒక అమ్మేవానిని చూసింది.
ఆమె చాలా చిరాకు పడి, దాదాపుగా అరుస్తునట్టుగా, "దయచేసి ఈరోజు నన్ను ఇబ్బంది పెట్టవద్దు. నేను ఒక ముఖ్యమైన మనిషి కోసం ఎదురు చూస్తున్నాను, కాబట్టి నా ఇంటి గుమ్మాన్ని ఖాళీగా ఉంచండి. నా సమయాన్ని వృధా చేయకు", ఆ అమ్ముకునే వానిని తరిమేసి హడావుడిగా తలుపు వేసింది.
మిఠాయిలు చేసిన తర్వాత, ఆ మహిళ వంటగదిని శుభ్రం చేసి, ముందు గదిలో స్వామి కోసం ఆత్రుతతో వేచి ఉంది.
కాసేపటికి మళ్ళీ ఎవరో తలుపు తట్టారు. భగవంతుడిని చూడాలనే ఆశతో మళ్ళీ తలుపు దగ్గరకు చేరుకుంది. తన కూతురితో ఆడుకోవడానికి వచ్చే పక్కింటి అమ్మాయిని చూసి నిరుత్సాహపడింది.
ఆమె అమ్మాయితో కోపంగా, "నన్ను క్షమించు, ఈ రోజు మేము ఒక ముఖ్యమైన అతిథి కోసం ఎదురు చూస్తున్నాం, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. రేపు తిరిగి వచ్చి మా పాపతో ఆడుకో" అని చెప్పింది.
ఆ అమ్మాయి సమాధానం కోసం ఎదురుచూడకుండా తలుపు వేసుకుని, భగవంతుడు వస్తాడని ఎదురుచూస్తూ ముందు గదిలోకి తిరిగి వచ్చింది.
గంటలు గడిచిపోయాయి, పగలు రాత్రిగా మారింది, కానీ భగవంతుని జాడ లేదు! భగవంతుడు తన వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదని ఆమె చాలా నిరాశతో ఆలోచించడం ప్రారంభించింది.
చివరికి, ఆమె ఆయన గురించి ఆలోచిస్తూ, ఏడుస్తూ నిద్రపోయింది. అప్పుడు భగవంతుడు కలలో కనిపించి, "నా ప్రియతమా, నేను ఈ రోజు రెండుసార్లు నీ దగ్గరకు వచ్చాను. రెండు సార్లు నువ్వు నన్ను తరిమేసావు", అని చెప్పాడు.
ఆమె ఆశ్చర్యపోయి, "ఇది నిజం కాదు! నీకోసం నేను రోజంతా ఎదురుచూశాను, ఎక్కడా నీ జాడ కనిపించలేదు. నువ్వు ఎప్పుడు వచ్చావు?" అని ఆమె అంది.
"మొదట నేను ఒక అమ్ముకునేవానిగా వచ్చాను, తరువాత పక్కింటి పాపగా వచ్చాను, కానీ రెండుసార్లు, నువ్వు నా మాట వినకుండా నన్ను తరిమికొట్టావు."
ఆ స్త్రీ తన తప్పును వెంటనే గ్రహించి, "క్షమించండి మహా ప్రభూ! నేను నిన్ను గుర్తించలేకపోయాను."
భగవంతుడు ఇలా చెప్పాడు, "నేను ప్రతిదానిలో ఉన్నాను, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాను."
భగవంతుని భావన మన మనస్సు యొక్క సృష్టి అని మనం అర్థం చేసుకోవాలి.
తరచుగా అది మనల్ని మోసం చేస్తుంది, దాని వలన మన అహం ఆడే ఆటను మనం అర్థం చేసుకోలేము.
భగవంతుడు ప్రత్యక్షమవుతాడు, దాని గురించి ఎటువంటి సందేహం లేదు, కానీ భక్తుని యొక్క సంకల్పం హృదయపూర్వకమైనదని భగవంతుడు భావించినప్పుడు మాత్రమే.
ఈ కథలోని స్త్రీ లాగే మనం కూడా మన చుట్టూ ఉన్న మనుషులను, జీవులను, వస్తువులను ప్రేమ, గౌరవం లేకుండా పరిగణిస్తాం... ఆపైన "భగవంతుడిని చూడాలని" ఆశిస్తాం.
మన చుట్టూ ఉన్న ప్రతి చేతన వస్తువులో, భౌతిక వస్తువులో భగవంతుడిని చూసే సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోకపోతే, ఇది సాధ్యం కాదు.
"అనంతమైన అంతిమతత్వాన్ని చేరుకోవడం ప్రతీ మానవుని ప్రాధమిక కర్తవ్యం."
మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి, 'భగవంతునితో సంపూర్ణ ఏకత్వం' అనేదే మన లక్ష్యం అయ్యిఉండాలి. ఆ లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించవద్దు🙏
🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
మా గ్రూప్ ల్లో చేరాలనుకునేవారు క్రింది లింకుల ద్వారా చేరవచ్చు .ఓం నమో భగవతేరమణాయ.
https://www.facebook.com/groups/459295881500972/?ref=share
https://www.facebook.com/groups/153987413305775/permalink/155075936530256/
https://www.facebook.com/groups/2541007569307530/?ref=share
https://www.facebook.com/sreelatha53/
No comments:
Post a Comment