Sunday, May 22, 2022

నాడు - నేడు

నాడు - నేడు

నాడు కలిసి ఉంటే కలదు సుఖం
నేడు కలిసి ఉంటే కలదు దుఃఖం
నాడు తృప్తికి, త్యాగానికి బానిసలం
నేడు బి.పి, షుగర్‌లకు వారసులం
నాటితరం ఆరవైలో ఇరవై
నేటితరం ఇరవైలో అరవై
నాడు అనురాగాలకు, ఆప్యాయతలకు వారసులం
నేడు టివిలకు సెల్‌ఫోన్‌లకు కట్టుబానిసలం
నాడు లేమిలోనే కలదు తృప్తి
నేడు కోట్టు ఉన్నా లేదు సంతృప్తి
నాడు ఆరుబయలే హాయినిద్ర
నేడు ఏసిలున్నా లేమినిద్ర
నాడు కళలకు భారతావని పుట్టినిల్లు
నేడు అవినీతికి నల్లధనానికి మెట్టినిల్లు
నాడు సంపాదన జీవన భృతికోసం
నేడు సంపాదన తృప్తిలేని జీవనం కోసం
నాడు మానవ బంధాలన్నీ భోగ భాగ్యాలు
నేడు మాన బంధాలన్నీ ఆర్థిక సంబంధాలు
నాటి మనిషి ఆస్వాదించాడు నవరసాలు
నేటి మనిషి ఆస్వాదిస్తున్నాడు సారంలేని రసాల్ని
నాడు ఇల్లు వాకిళ్ళు అమ్మానాన్నలతో ఆనంద నిలయాలు
నేడు వృద్దాశ్రమాలే ఆ జీవచ్చవాలకు నిలయాలు
నాడు బలానికి గక్తికి నెలవైన పప్పు చక్కలు, సున్నుండలు
నేడు రోగాలకు నెలవైన పిజ్ఞా, బర్గర్‌, కూల్ డ్రింకులు.......

సేకరణ

No comments:

Post a Comment