Sunday, May 22, 2022

ఇవి ఎవరితో పంచుకోకండి ...?

ఇవి ఎవరితో పంచుకోకండి ...?

పంచుకుంటే బాధ తీరుతుంది అంటుంటారు. కానీ ఇది అన్నివేళలా మంచిది కాదు. మనం ఒకరితే మన బాధను పంచుకుంటున్నాం అంటే..ఆ వ్యక్తిమీద మీకు అపారమైన నమ్మకం ఉండాలి.ఈరోజుల్లో మీరు ఎవరితో నైనా మీ సీక్రెట్స్ చెప్తే..అవి అక్కడితో ఆగేలా లేవు. మీరు చెప్పిందానికి ఇంకాస్త సాల్ట్ పెప్పర్ యాడ్ చేసి బయటకువదులుతారు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకునే విషయాలను మీరు ఎవరితో షేర్ చేసుకోవద్దట. అవేంటో చూద్దాం.
->మీ లక్ష్యాలు..
జీవితంలో ఏదైనా సాధించాలనే తపన అందరికి ఉంటుంది. అలాంటి లక్ష్యాల విషయానికి వస్తే, దాన్ని ఇతరులతో పంచుకోవటం అంత మంచిదికాదు. మిమ్మల్ని ఇతరులు ఎగతాళి చేయవచ్చు. ఇంకోటి..మీరు లక్ష్యాన్ని సాధించకపోతే.. ఇతరుల నుంచి భిన్నమైన ప్రశ్నలను ఎదుర్కొంటారు. ఇది మీపై భారీ ప్రభావాన్ని చూపిస్తుంది..
->చేసిన సాయం:
కుడి చేతితో చేసిన సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటుంటారు..అది అక్షరాల నిజం. మీరు ఎవరికైనా సాయం చేస్తే చేయండి అంతే కానీ..వాళ్లకు సాయం చేస్తూ ఫొటోలు దిగటం, వాటిని సోషల్ మీడియాలో పెట్టడం చాలా తప్పు. మీరు అనుకోకుండా లేదా ఆపదలో సహాయం చేసినా దాని గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. మీ సహాయానికి ఇతరులు మిమ్మల్ని అభినందిస్తారు. మీరు సహాయం చేసిన విషయాన్ని బయటకు చెబితే ప్రతికూల విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
స్వంత రక్షణ కోసం దాచిపెట్టిన మీ లేదా బ్యాంక్ బ్యాలన్స్ వివరాలను కూడా ఎప్పుడూ ఇతరులతో పంచుకోకూడదు. అది మీపై చాలా ప్రభావం చూపే అవకాశం కచ్చితంగా ఉంటుంది.
->మీ బలహీనతలు..
ఒక వ్యక్తి బలహీనతలు బయటకు కనిపించవు. కేవలం ఆ వ్యక్తి వాటిని తనంతట తాను ఇతరులతో షేర్ చేసినప్పుడు మాత్రమే వారికి తెలిసిపోతాయి. అయితే, బలహీనతలు వ్యక్తిగత విషయం, దాని గురించి మీరు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇతరులు దాని గురించి తెలుసుకుంటే.. వారు దాన్ని మీకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు. మన రెస్యూమ్ లో బలహీనతలు రాయల్సినప్పుడు మనకున్న స్ట్రేంథ్ మాత్రమే రాయాలి కానీ బలహీనతలు రాయాల్సిన అవసరం లేదు. ఇంటర్వూలో అడిగితేనే చెప్పాలి.
->మీ నైపుణ్యలు..
అవసరమైన చోటనే మీ ప్రతిభను వ్యక్తపరచాలి. అవసరం లేని సందర్భాల్లో మీ ప్రతిభను తప్పుగా బహిర్గతం చేయడం వ్యర్థమే కదా. ఇది విమర్శలకు కూడా దారితీస్తుంది. కాబట్టి, సరైన అవకాశాలను కనుగొని, మీ నైపుణ్యాలను ఉపయోగించడం కొనసాగించాలి.అలాగే కుటుంబ సమస్యల ఎవరితో పంచుకోకూడదు .

సేకరణ

No comments:

Post a Comment