Tuesday, September 6, 2022

విడుదల ఎప్పుడు... నీవు అనుభవించే ప్రతీ కష్టం నీ కర్మ క్షయమే .. ఈ సత్యం తెలుసుకుంటే మనసుకు దుఃఖమే లేదు...

 విడుదల ఎప్పుడు..

జీవితంలో ప్రతి మనిషికి ఎన్నో ఆలోచలు  సమస్యలు సందేహాలు..
 
భర్త/ భార్య/ పిల్లలు/ బందువులు లేదా అనారోగ్యం ఆర్దికం ఇలా ఎన్నో   సమస్యలు. ప్రతి మనిషి నాకే ఈ కష్టం నాకే ఈ బాధలు అనుకుంటూ..

 మరణ మృదంగాల ఆర్తనాదాలు నాకుటుంభంలోనే 
వేరే ఎవరికి బాధలు లేవు అని 
బాధ పడుతూ ఉంటారు. కానీ
చూసే మనసు నీకు ఉంటే ప్రతి మనిషికి ఓ కధ ఉంటుంది.చెదిరిన కల ఉంటుంది. కలతలు కన్నీరుతో కాసిన్ని జ్ఞాపకాలు ఉంటాయి.. 

మరి ఈ దుఃఖానికి అంతం ఎప్పుడు?? నాకు విడుదల ఎప్పుడు?

నీ చుట్టూ ఉన్న ప్రతి బంధము 
నీ జన్మల ప్రారబ్దమే. అప్పుడు ఎదయితే నువ్వు ఇచ్చావో అదే నీకు తిరిగి వచ్చి0ది.ఇందులో ఎవరి తప్పు లేదు ఒప్పు లేదు కేవలం నా ప్రారబ్దం అనుకుంటూ.. ఇక్కడ నేను యజమాని కాదు wachmen ఎపుడు నా ప్రాజెక్ట్ పూర్తి అయిపోగానే వెళ్లి పోతాము..

నీవు అనుభవించే ప్రతీ కష్టం 
నీ కర్మ క్షయమే .. ఈ సత్యం తెలుసుకుంటే మనసుకు దుఃఖమే లేదు..

జస్ట్ నాలుగు రోజులు ఈ ప్లానెట్ కు అతిధిగా వచ్చాను. వచ్చిన పని చూసుకు వెళ్లిపోతాను.
ఇక ఇప్పుడైనా వాసనలు ప్రోగు చేసుకోకుండా 
శుద్ధంగా వెళ్ళిపోతే జన్మ లేదు కర్మలేదు.. 
కాసేపు కల ఈ ఇల అనుకుంటే విడుదలే.... 

No comments:

Post a Comment