Tuesday, September 6, 2022

ప్రొఫెసర్ : భగవాన్ మౌనశక్తి అపారము. అది మాకు ఎంతో శాంతిని చేకూర్చుతున్నది. మౌనానికి అంతటి అపారశక్తి ఉన్నదా?

 ప్రొఫెసర్ : 

భగవాన్ మౌనశక్తి అపారము. అది మాకు ఎంతో శాంతిని చేకూర్చుతున్నది. మౌనానికి అంతటి అపారశక్తి ఉన్నదా?

మహర్షి : 

మౌనం అంటే ఎడతెగని వచస్సు(వాక్కు). వచస్సు సశబ్దమైనప్పుడు(శబ్దముతో కూడినప్పుడు) అది మౌనవచస్సుకు అడ్డు వస్తుంది. మౌనం దాల్చినవాడు తన పరిసరాలకు అత్యంతం దగ్గరగా ఉంటాడు.

 శ్రీ దక్షిణామూర్తి మౌనం నలుగురు ఋషులను(సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు) సంశయాలు లేకుండా చేసిందట. (మౌనవ్యాఖ్యాప్రకటిత పరబ్రహ్మ తత్వం), మౌనాన్ని, వ్యాఖ్య(comment) అన్నారు. మౌనశక్తి అంతటిది.

స్వరమైన వచస్సుకు, వాగవయవాలు(వాక్కు అనే అవయవాలు) అవసరం. కాని మౌనవచస్సు తలపులకు అవ్వలిది. మౌనవచస్సు వాగతీతము(వాక్కుకు అతీతము), పలుకని పదము, పరావాక్కు. 

No comments:

Post a Comment