Thursday, September 1, 2022

 డబ్బు ఉన్నవాడు అబద్దం చెప్పిన నిజమే అనుకుంటారు కానీ, 

డబ్బులేనివాడు నిజం చెప్పిన అబద్దమే అనుకుంటారు. 

ఈ సమాజం మనిషిని నమ్మదు మనిషి వెనుకాల ఉన్న ఆస్తిని నమ్ముతుంది.

పచ్చ నోటుముందు మాయమై పోతున్నాయి బంధాలు. 

ధనం ముందు గుడ్డిదై పోతుంది గుణం. 

ఆస్తులముందు ఆవిరైపోతున్నాయి ఆప్యాయతలు.

నీవు ఎంతమంచితనంతో బ్రతుకుతున్న కూడా నివ్వు చేసే ఒక చిన్నపొరపాటుకోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది.

దానిని బూతద్దంలో చూడటం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది ఇదే ఈ లోకం నైజం.

నీవు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు... 
ఒకటిమాత్రం గుర్తుపెట్టుకో దేవుడనేవాడు ఒకడున్నాడు లెక్క సరిచేయకుండా ఊరుకోడు మధనపడకు.

కష్టసుఖాలు సీజన్ వంటివి మనకు నచ్చక పోయిన అవి రావాల్సిన టైంకీ వస్తాయి,

ఉండాల్సిన రోజులు ఉంటాయి,

పోవాల్సిన టైం వచ్చినప్పుడే పోతాయి. 

ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని.

వచ్చేటప్పుడు శరీరంతో, పోయేటప్పుడు ఆత్మతో... 

వచ్చి వెళ్లడం అదే మన జీవిత సారాంశం. 

మధ్యలో జరిగేదంతా దేవుడు అల్లే ఒక కట్టు కథ... 🙏🏻

No comments:

Post a Comment