Thursday, September 1, 2022

మాయ యొక్క ఆనవాలు పట్టడానికి కానీ, వర్గీకరించేందుకు కానీ, మాయ తత్వాన్ని నిరూపించడానికి కానీ మనిషి ఏ ప్రయత్నం చేసినా అది “పుట్టుకతో అంధుడైనవాడు నల్లపిల్లిని చీకటి గుహలో అర్ధరాత్రి వేళ వెదకినట్లు”గా ఉంటుంది.

 ॐశ్రీవేంకటేశాయ నమః
💝 మాయ యొక్క ఆనవాలు పట్టడానికి కానీ, వర్గీకరించేందుకు కానీ, మాయ తత్వాన్ని నిరూపించడానికి కానీ మనిషి ఏ ప్రయత్నం చేసినా అది “పుట్టుకతో అంధుడైనవాడు నల్లపిల్లిని చీకటి గుహలో అర్ధరాత్రి వేళ వెదకినట్లు”గా ఉంటుంది.
💖 మనిషిని మాయ స్వాధీన పరచుకొన్నా మనిషి గుర్తుపట్టలేడు. మాయ ఆవరించిఉన్నపుడూ, మాయ ప్రాబల్యము సడలిన తరువాతా కూడా దాన్ని మనిషి పరిగణలోకి తీసుకోడు.
💕 అనంతమైన శక్తితో ఎవరినీ విడవకుండా విశ్వమంతా వ్యాపించి ఎల్లవేళలా క్రియాశీలగా మాయ తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది.
💕 ఎవరైనా సరే కృషితో తన శక్తినీ, బుద్ధినీ తర్కములో పెంపొందించుకొని ఎన్నెన్నో పుస్తకాలు చదవవచ్చు. శాస్త్రీయ విజ్ఞానము పెంపొందించుకొని, అనేకానేక ఉపన్యాసములివ్వవచ్చు. కానీ కేవలం పుస్తక అధ్యయనముతో దివ్యానుభవాన్ని మాత్రం పొందలేరు.
❤️ వ్యాకరణము, సాహిత్యం, నాటకము, సంగీతము వంటి వానిలో ఉద్దండులు, వక్తలు అయి ఎన్నో డాక్టరేట్లు సంపాదించవచ్చు. కానీ ఎల్లపుడు భగవంతునిపైనే మనుసు నిలిపి, వాక్కు, ఆలోచనలు, క్రియలు భగవంతనువిగా చేయడం మనుషుల ఊహకుకూడా అతీతమై ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు.
💝 ఈ విషయంగా ఒక చిట్టి కథను చూద్దాం.
💕 నలుగురు వ్యక్తులు ఒకే సమయంలో ఒక ద్రాక్షతోటలోకి ప్రవేశించారు
💕 ద్రాక్ష పండ్లు బాగా పండి ఉన్నాయి. నలుగురిలోని ఒకడు తోటలోని మట్టి మీద ప్రయోగాలు ప్రారంభించాడు.
💕 రెండోవాడు ఆ పండ్ల ఆకారం, పరిమాణము, రంగు మీద తన పరిశోధన ప్రారంభించాడు.
💕 మూడోవాడు పండ్ల కోత తరువాతి వాణిజ్య అంశాలపనిలో పడ్డాడు.
💕 చివరి వ్యక్తి అటువంటి పనికిరాని పరిశోధనలూ, ప్రయోగాలూ పట్టించుకోకుండా నేరుగా తోటలోని పండ్లను కోసుకుని తినడం మొదలెట్టాడు.
💝 ఆ నలుగురిలోనూ పండ్లు తిన్నవాడు మాత్రమే వాటి రుచిని ధృవీకరించి చెప్పగల సమర్థుడు.
మిగతావారెవరూ చెప్పలేరు కదా.
💖 ఇదేవిధంగా, పదాల అందాన్నీ, అర్థాలనూ లోతుగా పరిశోధించవచ్చు. కానీ అంతటితో దైవత్వాన్ని ఎన్నడూ గ్రహించలేరు.
💞 కేవలం మాయ గురి౦చి చర్చి౦చి, లోతుగా శోధించి, పరిశోధనచేసే వ్యక్తులు మాత్రమే దాన్ని అర్థ౦ చేసుకోవడ౦లో ఇంతోఅంతో సఫలీకృతులౌతారు. కానీ మాయను పూర్తిగా గ్రహి౦చడంగానీ, దాని మాయలోంచి బయటపడడం కానీ సులభసాధ్యం కాదు.
💖 ఏ గురువూ కూడా మాయను గురించి తన శిష్యులకు అవగాహన కలిగించలేడు. తాను పూర్తిగా మాయను తెలిసికొని ఉండి, దాంట్లోని మాయామైకంలోంచి బయటపడితే కదా తాను దాని గురించి అవగాహన కలిగించేదీ…!
తాను నిజంగానే తెలుసుకుంటే మనముందెందుకుంటాడూ..?!
❤️ ॐశ్రీవేంకటేశాయ నమః
~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి

No comments:

Post a Comment