Monday, October 24, 2022

 శుభోదయం:

        🍃🥀వాగే వాడితో సీక్రెట్స్ చెప్పకూడదు, వాదించే వాడితో ఆర్గుమెంట్ చేయకూడదు, తెలివైన వాడితో పోటీ పడకూడదు, తెగించిన వాడితో తలపడకూడదు...

🪷 మనం ఒక మెట్టు ఎక్కగానే మాటలో చూపులో తేడా వచ్చింది అంటే భగవంతుడు పది మెట్లు కిందకు దించుతాడు...

🪷 ఏ పనైనా చేయడానికి  భయపడుతున్నామంటే.. అది కష్టమైనది కావడం వల్ల కాదు.. మనం భయపడుతున్నందు వల్లే అది కష్టంగా అనిపిస్తోందని తెలుసుకోలేకపోవడం వల్ల...

🪷 కొందరిని చూసి ఎలా బతకాలో తెలుస్తుంది కొందరిని చూస్తే ఎలా బతక కూడదో తెలుస్తుంది కాలం ఎప్పుడూ నేర్చుకోమంటూనే ఉంటుంది...

🪷 నమ్మినవారు మోసం చేశారని అందరి మీద నమ్మకం కోల్పోకు, బొగ్గువల్ల చేతికి మసి అంటిందని, వజ్రం దొరికితే వదులుకోలేం కదా...

🪷 అన్నిచోట్లా మనిషిని తెలివి మాత్రమే కాపాడదు.. అప్పుడప్పుడు నీ మంచితనం కూడా నిన్ను రక్షిస్తుంది...

🪷 బలవంతుడు శత్రువుల్ని జయిస్తే బుద్ధిమంతుడు శత్రుత్వాన్ని జయిస్తాడు..

No comments:

Post a Comment