Friday, December 23, 2022

 హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ:🙏

ఈశ్వర హంసల వ్యవహారాన్ని వెనక్కి తీసుకో గలిగినవాడు బ్రహ్మ నిష్టుడు ... జీవహంసల వ్యాపారాన్ని నిరోధించటం ఆత్మనిష్ట. 

అనుభవ జ్ఞానంతో నిర్ణయించబడే ఈ బ్రహ్మనిష్ట ఏ లిఖిత వచనాలలో లభించదు. 

జీవన్ముక్తుడు అకర్త ... ఏ జీవ వ్యవహారం .. ఏ కర్తవ్యం .. ఏ త్రిపుటి అతనికి లేదు. 

అష్ట తనువులు ఎవరైతే దాటాడో అతను పరబ్రహ్మము ...ఉన్నది ఉన్నట్లుగా ఉండటం పరబ్రహ్మ దగ్గర ప్రారంభం. 

విదేహముక్తునికి త్యాజ్యము.. భోగ్యము అనునవి లేవు ... స్మరణ= ఎరుక .. విస్మరణ= మరపు లు లేవు. 

అకారణుడు ... అవ్యక్తుడు .. అప్రమేయుడు.. అగ్రాహ్యుడు .. అవాంగ్మానస గోచరం ..అజం .. ఇవి ఆరు విదేహముక్తుని లక్షణములు. ఈ ఆరు లక్షణములకు భగము అని పేరు ... ఈ లక్షణములు ఉన్న అతడు భగవంతుడు. 

వాసనాక్షయ... మనోనాశ.. స్వరూప జ్ఞానములు .. ఏక కాలంలో రెప్పపాటులో జరిగినవాడు తురీయానికి అధికారి. 

సచ్చిదానంద పరమానంద.. మేహేర్ బాబా నిత్యానంద.. 
అతీతమునకు అతీతమైనవాడు విదేహ ముక్తుడు. 

అతీత స్థితిలో ఉన్నవాడు రహిత స్థితిని తెలుసుకోజాలడు. 

శ్రీ విద్యా సాగర్ స్వామి వారు 
ఋభుగీత -16
జై గురుదేవ 🙏

No comments:

Post a Comment