Thursday, December 29, 2022

సరైన సాధన అంటే శ్వాస మీద ధ్యాస పెట్టీ శ్వాస మరియు ఆలోచనలు లేని స్థితికి ఆటోమాటిక్ గా చేరుకుంటారు..

 అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నపుడల్లా ఇంకొక్క అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకోవాలి.. భయం బంధిని చేస్తే ధైర్యం దారి చూపించి గమ్యాన్ని చేరుస్తుంది... అందుకే పెద్దలు ఊరకే చెప్పలేదు ఆత్మ స్థైర్యం ఉంటే అద్భుతాలు సృష్టించ వచ్ఛని... అలాంటి ఆత్మ స్థైర్యం, ధైర్యం, వివేకం, విచక్షణా జ్ఞానం విజ్ఞానం, ఆత్మ జ్ఞానం, ఆనందం ఒకే ఒక్క సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం...
     సరైన సాధన అంటే శ్వాస మీద ధ్యాస పెట్టీ శ్వాస మరియు ఆలోచనలు లేని స్థితికి ఆటోమాటిక్ గా చేరుకుంటారు.. ఆ స్థితిలో కూడా శ్వాస మూలాధారం నుండి సహస్రారం వరకు క్రిందకు పైకి ఆడుతుంది.. అపుడు కూడా ఆలోచనలు ఉంటాయి అనగా ఆ స్థితిని గమనిస్తూ అనంతమైన విశ్వశక్తి ప్రవాహాన్ని గమనిస్తూ ఉంటుంది... ఇలాంటి అధ్బుతమైన అపూర్వమైన ప్రక్రియ గురించి తెలుసుకుని, తెలుసుకున్న సాధన చేస్తే సరిపోతుంది..
     మీ జీవితం మీ చేతుల్లో... మీ అధ్బుతమైన ఆలోచనలలో... అధ్బుతమైన ఆలోచనలు సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం అనే సత్యాన్ని తెలుసుకోవాలి.
పసుపుల పుల్లారావు, ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తెలంగాణా రాష్ట్రం
9849163616

No comments:

Post a Comment