⚜️🕉️🚩ఓం అరుణాచలేశ్వరాయ నమః🌹🙏
భూరంభాంస్యనలోఽనిలోఽంబర మహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ |
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో
తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే
💥జగద్గురు ఆదిశంకరాచార్య చెప్పిన దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక పాదం ఇది.
దీని అర్థమేమంటే.. అంతటా నిండి నిబిడీకృతమైన శివ చైతన్యం కంటికి కనపడే విధంగా అష్టమూర్తి తత్వంగా ప్రకాశిస్తుంది అని.
ఈ ప్రపంచంలో మనం శివుడిని ఎనిమిది రూపాల్లో చూడగలమట. ఆయన తత్వమంతా ఎనిమిది అంకెమీదే నడుస్తుంది.
పృథ్వి, అగ్ని, జలం, వాయు, ఆకాశములు పంచ భూతాలు.. ఈ ఐదుతో పాటు సూర్యచంద్రులు, జీవుడు. ఈ ఎనిమిది శివస్వరూపాలు.
వీటిని శివ స్వరూపాలుగా నిర్థారణ చేయడం కోసమే ఈ ఎనిమిది లింగాలు మనకు దర్శనమిస్తున్నాయి.
💥అవి కంచిలో పృథ్వి లింగం, జంబుకేశ్వరంలో జల లింగం, అరుణాచలంలో అగ్ని లింగం, చిదంబరంలో ఆకాశ లింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్క్‌లో సూర్య లింగం, సీతాకుండంలో చంద్ర లింగం, కాఠ్‌మాండులో యజమానలింగం.
💥అగ్నిలింగం💥
మిగిలిన పంచభూత లింగాల మాదిరిగా ఇక్కడి శివుడు అగ్నిరూపంలో దర్శనమివ్వడు.
కేవలం రాతి లింగంగానే ఉంటాడు.
అరుణాచలం పరిసర ప్రాంతాలతో పోలిస్తే ఆలయంలో విపరీతమైన వేడి ఉంటుంది.
అది జ్ఞానాగ్ని వల్ల వచ్చే వేడి అంటారు.
జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వారి కర్మలు దగ్ధమవుతాయి. దాని వలన మళ్లీ జన్మించాల్సిన అవసరం లేకుండా పాపాలన్నీ పోతాయి.
అందుకే అరుణాచలాన్ని జ్ఞాన స్వరూపమైన అగ్నిలింగం అంటారు.
💥అరుణాచలం ఎందరో సిద్ధ పురుషులకు ఆలవాలం.
దేవతలు కూడా ఎప్పుడూ ప్రదక్షిణ చేస్తుంటారు.
పర్వతం మొత్తం శివ స్వరూపం.
అరుణాచలంలో ఒక మినహాయింపు ఉంది.
ఆ పర్వతం చుట్టుపక్కల 24మైళ్ల దూరం దాని తేజస్సు పడుతుందట.
అక్కడ ఏ దీక్షా అవసరం లేదట.
ఇందుకు రమణ మహర్షి జీవితంలో జరిగిన ఓ ఘటనను ఉదాహరణగా చెబుతారు.
💥#భగవాన్_రమణమహర్షి💥 (శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అవతారం)
అరుణాచలం పర్వతంపై గల విరూపాక్ష గుహలో తెల్లటి కౌపీనం ధరించి ఉన్నారట.
ఆ సమయంలో శృంగగిరి పీఠం నుంచి ఓ పండితుడు వచ్చి.. ‘అయ్యా! మీరు అన్నీ విడిచిపెట్టేశారు.
ఏ బంధనాలు లేవు.
ఇలా తెల్లటి గోచి పెట్టుకుని ఉండటం కన్నా సన్యాసం స్వీకరించి, కాషాయ వస్త్రాలు ధరిస్తే బాగుంటుంది.
సన్యాసం కాదంటే ఓ కాషాయ కౌపీనం ధరిస్తే బాగుంటుంది’ అని సలహా ఇచ్చారట.
అందుకు రమణ మహర్షి ఏ సమాధానం ఇవ్వలేదట.
తాను మళ్లీ వస్తానని మనసు మార్చుకుంటే చెప్పండి అని ఆ పండితుడు వెళ్లిపోయారట.
కొద్దిసేపటికి ఓ వృద్ధుడు పుస్తకాల సంచీతో అక్కడి వచ్చి ‘నేను స్నానం చేయలేదు. ఈ మూట చూస్తూ ఉండు’ అంటూ రమణ మహర్షికి చెప్పి వెళ్లిపోయాడట.
పుస్తకాల మూటను విప్పి చూసిన రమణులు అందులో పైనున్న పుస్తకాన్ని తెరచి చూశారు.
అది సంస్కృతంలో ఉన్న ‘అరుణాచల మహత్యం’ అనే పుస్తకం.
గిరి పర్వతం చుట్టుపక్కల 24 మైళ్ల వరకూ ఏ దీక్షా నియమాలు ఉండవని అందులో రాసి ఉందట. పరమ శివుడే వృద్ధుడి రూపంలో వచ్చి రమణ మహర్షికి పుస్తకాలను అందజేశారని చెబుతారు.
ఆ పుస్తకాన్ని చూపితే పండితుడు మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడట.
💥పర్వత గుహలో దక్షిణామూర్తి💥
అరుణాచలం పర్వతం లోపల మధ్యలో ఓ పెద్ద గుహ ఉందట.
అక్కడ ఓ పెద్ద మర్రిచెట్టు ఉంటుందని దాని కింద దక్షిణామూర్తి స్వరూపుడై సిద్ధయోగిగా పరమశివుడు ఇప్పటికీ కూర్చుని ఉంటాడని నమ్మకం.
అయితే అక్కడకు వెళ్లాలని ప్రయత్నించిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరకు వెనుతిరిగి వచ్చేశారట.
అలా దక్షిణామూర్తిని దర్శించాలని బయలుదేరి వెనుదిరిగిన వారిలో రమణ మహర్షి కూడా ఉన్నారట.
అరుణాచలం పరమ సత్యమైన క్షేత్రం.
శివుడు లింగరూపంలో ఆవిర్భవించిన తర్వాత అక్కడ నిర్వహించవలసిన పూజాది కార్యక్రమాలు ఎలా చేయాలనే విషయాన్ని నిర్ణయించమని, గౌతమ మహర్షిని ఆదేశించారట.
అరుణాచలంలో ఏయే సేవలు ఉండాలి.. ఏ ఆలయాలు ఉండాలి.. ఏ పూజలు చేయాలి.. అని నిర్ణయం చేసిన వారు గౌతమ మహర్షి.
ఈ క్షేత్రానికి కాల భైరవుడు క్షేత్రపాలకుడు.
స్థల వృక్షం ఇప్ప చెట్టు.
అబిత కుచాంబ అనే పేరుతో అమ్మవారు ఇక్కడ ఉంటారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
No comments:
Post a Comment