Wednesday, December 28, 2022

మనసును నిగ్రహించటం లేదా నాశనం చేయటం ఎలా సాధ్యమవుతుంది ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"406"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼

*"మనసును నిగ్రహించటం లేదా నాశనం చేయటం ఎలా సాధ్యమవుతుంది ?"*

*"భగవాన్ శ్రీరమణ మహర్షి ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం ఇచ్చారు. మనసును ఎలా నిగ్రహించాలి అని అడిగిన వారిని నీ మనసు నాకు చూపించమని అడిగారు. ఏం చేయాలో అప్పుడు తెలుస్తుందని సెలవిచ్చారు. నిజంగా చూస్తే మనసు కేవలం తలపుల మూట. ఆ విధంగా తలచి గానీ, కోరి గాని దానిని ఎలా నాశనం చేయటం ? నీ తలపులు, కోర్కెలు నీ మనసుకు అంతర్భాగాలే. క్రొత్త, క్రొత్త తలపులతో మనసు కిక్కిరిసిపోతుంది. కాబట్టి మనసును మనసుతో నాశనం చేయబూనటం తెలివి తక్కువ పని. ఆ మనసు మూలం వెదికి పట్టుకోవాలి. అప్పుడు అది తనంతట తానే మాయమవుతుంది. నిద్రితునికి ఆత్మవిచారణ అక్కర్లేదు. అభ్యసించ వలసిందేమీ లేదు. మెలకువగా ఉన్నప్పుడే దాన్ని కోరేది అభ్యసించ వలసింది. జాగృతిలో అభ్యాసం కొనసాగించాలి నిద్ర నుండి లేచీ, లేవగానే దాన్ని తిరగదోడాలి !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
        

No comments:

Post a Comment