ఈశ్వరః సర్వభూతానాం
*"ఈశ్వరః సర్వభూతానాం" అనగా అందరిలోనూ ఈశ్వరుడున్నాడు.*
*శివుడు లేనివాడు శవమైపోతాడు.*
*భగవంతుడు ఏ కాశీలోనో అమరనాథ్ లోనో భద్రాచలం లోనో మాత్రమే ఉన్నాడన్న భావమును పూర్తిగా తీసివేసి, ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాపి, సర్వ భూతాంతరాత్మ అని విశ్వసించి ధీనజన సేవయే దేవుని సేవగా తెలుసుకుని దైవ భావముతో వారిని ఆదరించాలి.*
*సజీవ దేవతా విగ్రహులైన మానవులను సేవించుట చేత నిత్యసత్యమైన ఆత్మానుభూతి లభించి అమితానందం కలుగుతుంది. భగవంతుడు కూడా సంతృప్తి చెందుతాడు.*
*ఇట్టి స్థితియందున్నవారికి కష్టము, నష్టము, విచారము,విషాదము అన్నీ తొలగిపోతాయి. అమితానందము సిద్ధిస్తుంది.*
No comments:
Post a Comment