Sunday, December 25, 2022

భగవంతుణ్ని పూజించడంలో అనేక పద్ధతులు ఉన్నాయి.

 *🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏*   
                          

 *భగవంతుణ్ని పూజించడంలో అనేక పద్ధతులు ఉన్నాయి.* 

🌷 *మనసులో భగవంతుని రూపాన్ని ధ్యానించడం,* 

🌹 *దేవునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించడం,* 

🔆 *కూతురితో ప్రవర్తించిన విధంగానే కోడలితోనూ ప్రవర్తించడం.*

‼️ *ఎవరినీ ద్వేషించకుండా ఉండడం.*

👉 *ఎదుటివాళ్లు మనకేమిచ్చారనే ఆలోచనలను వదిలి మనం వాళ్లకేమివ్వగలమోననే ఆలోచన చేయడం.*

🙏 *భగవంతుడి నామ సంకీర్తన చేయడం  వంటివన్నీ భగవంతుని పూజా విధానాలే.* 
*👉1. కృతయుగంలో ధ్యానం* 

*👉2. *త్రేతాయుగంలో యజ్ఞాలు*.
*👉3. ద్వాపర యుగంలో అర్చనలు*.
*👉 4. కలియుగంలో భగవన్నామ సంకీర్తనం*.

*👉~భగవంతుని అనుగ్రహానికి మేలైన మార్గాలు. మోక్షప్రాప్తికి తగిన సాధనాలు అని శాస్త్రాలలో చెప్పారు.*

 *ముక్తి సాధనాలు గా కర్మయోగం, రాజయోగం,* *భక్తియోగం,* *జ్ఞాన యోగం*

*అని నాలుగు యోగాలు, శాస్త్రాలలో తెలిపారు.*

🖋️ *సాధారణంగా లాభాపేక్షతో జనులు కర్మలు చేస్తారు. ఫలాపేక్ష వదలి కర్మలు చేయాలని అదే నిష్కామ కర్మయోగమని గీతాచార్యుడు బోధించాడు.*

*🌾*దీని వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. నిష్కామకర్మ బంధం నుండి విడిపిస్తుంది.*

🌸 *ప్రతి పనిని  భగవత్‌ కైంకర్యమనే భావంతో చేయాలి. ఇదే కర్మయోగం.*

No comments:

Post a Comment