Wednesday, December 28, 2022

అనంతమైన, సృజనాత్మకమైన స్వేచ్ఛను పొందడం ఎలాగ?* *How to attain Dynamic Freedom which is Unlimited?

 *అనంతమైన, సృజనాత్మకమైన స్వేచ్ఛను పొందడం ఎలాగ?*  
*How to attain Dynamic Freedom which is Unlimited?*
*~~~*
       -  సద్గురు శ్రీ మెహెర్
          చైతన్యజీ మహరాజ్

(Part - 7)

*(ప్రశ్న:: _చాలా మంది ఆధ్యాత్మిక వేత్తలు– "దేవుడు కావాలంటే, ఈ భౌతిక జీవితాన్ని విడిచిపెట్టాలి" అంటారు కదా.  నిజంగా వీటిని విడిచిపెడితేనే  దేవుడు లభిస్తాడా ??_*
             (Or)
*_ఏది "బంధన"? ఏది/ఏమిటి "స్వేచ్ఛ"??_*

*గురుదేవులు::   The process of getting bound and then unbound is charged with immense significance.*
        *అసలు, ఈ _"అనుభవం"_లో బంధింపబడడం, (అలా) బంధింపబడినటువంటి జీవితానుభవము నుండి తప్పించుకోవడం– (అనేటువంటి) దీనికొక ముఖ్యమైనటువంటి విశిష్టత ఉన్నది అని తెలియజేస్తున్నారు.*
       
*"జీవితము" అనేటువంటి అనుభవం లేనప్పుడు– నీకు లక్ష్యమూ లేదు, గమ్యమూ లేదు. "జీవిత అనుభవము"ను పురస్కరించుకుని– నీకు ఒక "లక్ష్యము" ఉన్నదనిన్నీ, నీకొక "గమ్యము" ఉన్నదనిన్నీ నీవు గుర్తించగలుగుతావు.*
         చాలామంది ఈ ఆధ్యాత్మిక వేత్తలు అంటుంటారు:: "ఈ జీవితము అనేటువంటిది విడిచిపెట్టాలి" అని. "ఈ జీవితమనేటువంటిది నిన్ను బంధిస్తుంది. అందుచేత ఈ జీవితాన్ని– ఈ "భౌతిక జీవితాన్ని" నీవు విడిచిపెట్టు " అంటుంది (సాంప్రదాయం). "దీన్ని త్యాగము చెయ్యి!" అంటుంది, "దీనిని సన్యసించు!" అంటుంది ఈ ఆధ్యాత్మికమైనటువంటి సాంప్రదాయం.

*బాబా అలా చెప్పరు. (వారు తెలియజేసేది ఏమిటంటే)::*
      _"అమూల్యమైనటువంటి నీ జీవితాన్ని, నీ జీవిత అనుభవాన్ని, నీ జీవితాన్ని నిర్వహింప చేసేటువంటి నీ మేధస్సు, నీ తెలివి ఇవన్నీ కూడా– నీకు ఉపయుక్తం అవ్వడానికే, నీ జీవితాన్ని పురోగమింప చేసి నిన్ను గమ్యం చేర్చడానికే ఇదంతా ఉద్దేశింపబడింది"_
*అని బాబా తెలియజేసారు. (ఇంకా తెలియజేస్తూ)::*
       _కానీ, ఈ జీవితానుభవంలో వ్యక్తి అనుభవించేటువంటి ద్వంద్వానుభవాలు–_
      -  మంచి - చెడు,
      -  పుణ్యము - పాపము,
      -  కష్టము - సుఖము,
_అనేటువంటి ఈ ద్వంద్వానుభవములు అనుభవిస్తూ,_
    -   "కష్టము" నుండి
          సుఖానుభవానికీ,
    -    "దుఖము" నుండి
         "శాంతి" అనుభవానికీ,
    -    "పాపము" నుండి
         "పుణ్యము"నకు,
    -    "చెడు" నుండి
          "మంచి"కి
_వెళ్ళాలని ఏ వ్యక్తి అయితే అనుకుంటాడో, ఏ వ్యక్తి అయితే సంకల్పించుకుంటాడో, ఆ వ్యక్తి యొక్క భావనలో, ఈ ద్వంద్వానుభవాలతో కూడినటువంటి జీవితము ఒక బంధన అని గుర్తుంచుకోమని చెబుతారు._
        _"ఇది బంధన!" అనేటువంటిది నీవు తెలుసుకోవడానికే గానీ, దానిని నీవు విడిచిపెట్టడం కోసం కాదు._
          _*"ఇది బంధన!" అని దీనిని విడిచిపెట్టి ఏ అరణ్యాలకో, కొండ గుహలలోకో పోయినట్లయితే– నీ జీవితం నీ కూడానే ఉంటుంది.(ఎందుకంటే)*_
     నీవు విడిచి పెట్టింది
     బాహ్యమైనటువంటి
     ఈ సంసారాన్ని;
     ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి
     వెళ్ళావే గానీ, 
     నీ జీవితాన్ని నీవు
     విడిచి పెట్టలేదు, 
     నీవు అధిగమించలేదు.
           నీ కూడానే వస్తుంది
           జీవితం.
_*అందుచేత, ఈ జీవితమనేటువంటిది ద్వంద్వభూయిష్టమైనటువంటి ఒక బంధన అని గుర్తించమన్నారు బాబా. గుర్తించి, దానిని అధిగమించవలసినటువంటి అవసరమున్నది అని ఎరుక కలిగి ఉండమన్నారు.*_

*బాబా ఈ వాక్యంలో చెప్తున్నారు::*
       The process of getting bound and then unbound is charged with immense significance.
   -  జీవితం యొక్క బంధన,
   -  బంధన నుండి విడుదల,
*ఈ రెంటికీ ఒక విశిష్టత ఉన్నది అని తెలియజేస్తున్నారు. దానికి ఎంతో ఇతోధికమైనటువంటి ప్రయోజనము ఉన్నది అని చెప్తున్నారు. అంటే,*
  "బంధింపబడ్డాను!"
   అనేటువంటి
   అనుభవముల ద్వారానే,
  "నేను బంధన నుండి
    విడుదల అవ్వాలి!"
    అనేటువంటి కోరిక
    నీకు కలుగుతుంది.
         "బంధన" అనుభవం
          ద్వారానే, "విడుదల"
          అయినటువంటి
          ఆ "స్వేచ్ఛానుభవము"
          నీకు తెలియబడుతుంది.
*అందుచేత ఈ రెండూ కూడా ఎరుక కలిగి ఉండడం అనేటువంటిది ఎంతో అవసరమని తెలియజేస్తున్నారు.*

_The soul gets mixed up with the body and then gets caught up with it._


To be contd.....

No comments:

Post a Comment