వానప్రస్థం
*"**
ప్రేమకు పరాకాష్ట , భార్యా భర్తల చరమావస్త ..."వార్ధక్యమే " ...
ఒకరికొకరు తోడుగా నీడగా..
ఓ గూటి కాపురమే శ్రుతి లయగా
వెళ్లబుచ్చే అనురాగ జీవానాలు
మొదట ప్రేమాకర్షణల వలయంలో
తరువాత బరువు బాధ్యతల చక్రంలో
చివరగా ఇక వాటేసుకున్న
వానప్రస్త జీవన సరళి లో....
తల్లి తండ్రులై ....బిడ్డలా ఆలనా పాలనల్లో మనసా అంకితమయేరు
ఈ రోజు ఆ బిడ్డల తలపుల్లో..
.వారి దూరంలో...అలవాటు పడుతూ
ఒకరికొకరు తోడూ-నీడలై మిగిలేరు
భార్యగా నిరంతరం "గృహమే స్వర్గ సీమ
చేశే ను...
భర్తగా ఆసాంతం కమ్మని
"జీవన మాధుర్యం " ఇచ్చేను...
ఈ రోజుకీ "చిలకా-గోరొంక " లై అన్యోన్యంగా గూటి కాలక్షేపం లో,
కరిగి పోతూ "ఒకరికొకరి ఆత్మీయ
శీతల సామీప్యం , సాన్నిహిత్యం..అవే వారి మాధుర్యపు శ్వాస లై...
సాగిస్తున్న జీవన యానం
వయో వృద్ధు లైనా....
పతి ధ్యాసలో భార్య ,
పత్ని బాగు లో భర్త...
అర్ధనారీశ్వర దాంపత్యమై
పగలు-రేయీ , వెలుగు-నీడల చందంగా...అంటిపెట్టు కునీ...
నేడు....
కరిగి పోతున్న కొవ్వొత్తులై, పంచుకునే వెలుగులతో , పంచుకుంటున్న ప్రేమసుధల.. వారి జీవన సంధ్య లో
అంకిత అర్పిత జీవనాలు .
No comments:
Post a Comment