[12/28, 12:59] +91 73963 92086: 🎻🌹🙏మహర్షుల దివ్య చరిత్రలు..
🌹ఈరోజు 66 ,వ వామదేవ మహర్షి గురించి తెలుసుకుందాము..🌹
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿ఇప్పుడు మనం వామదేవ మహర్షిని గురించి తెలుసుకుందాం .ఇంతమంది మహర్షుల్ని మనం చూస్తూ , అంటే తెలుసుకుంటూ వస్తున్నాం కదా ...
🌸ఒకళ్లని మించి ఒకళ్ళు గొప్పవాళ్ళే వున్నారుకదా ! ఈ మహర్షిని కూడా చూద్దాం ..... వామదేవుడు తల్లి కడుపులో ఉండగానే పూర్వజన్మ పుణ్యం వల్ల ఆత్మజ్ఞానం పొందాడు . సంసారంలో ఇరుక్కోకుండా , రోగాలు , మళ్ళీ మళ్ళీ జన్మలు లేకుండా సర్వజ్ఞుడు , అపూర్వుడు , అద్వితీయుడై వెలిగాడు .
🌿వామదేవుడు పెరిగి పెద్దవాడై చాలామంది శిష్యులికి జ్ఞానాన్ని బోధిస్తూ అపర శివుడిలా శరీరమంతా విభూతితో వుండేవాడు . జుట్టు జడలు కట్టి ఉండేవాడు .
🌸ఆయన నిరాశ్రయుడు , నిరహంకారి . శిష్యులతో భూసంచారం చేస్తూ కుమార శిఖరం దగ్గర కుమారస్వామిని చూసి పూజించి ప్రణవోపాసనం గురించి తెలియ చేయ్యమన్నాడు వామదేవ మహర్షి .
🌿కుమారస్వామి ప్రణవం గురించి చెప్పకలిగినవాడు ఒక్క శివుడేనని చెప్పాడు . శివుడే ప్రణవమనీ , ఆయనకి అయిదు ముఖాలు , పదిచేతులు ఉంటాయనీ , ఆయన స్వయంభువుడనీ , ఆయనే ప్రణవార్ధమనీ చెప్పి మహర్షీ ! నీకు తెలియంది లేదు .
🌸అయినా కొన్ని విషయాలు చెప్తాను వినమని ఓంకారం ఎలా స్మరించాలి , ఎలా ఉచ్ఛరించాలి , గురుశిష్య సంబంధమెలా ఉండాలి , శివతత్త్వమంటే ఏమిటి అన్నీ తెలియ చెప్పి నువ్వు ఎవర్ని కాపాడాలనుకుంటావో వాడు తప్పకుండా తరిస్తాడని చెప్పి కైలాసానికి బయలుదేరాడు కుమారస్వామి .
🌿కుమారస్వామితో పాటు వామపాదుడు కూడా కైలాసానికి వెళ్ళి శివుడి పాదాల మీదపడి చాలాకాలం కైలాసంలో వుండిపోయాడు .
🌸వామదేవుడు శివపంచాక్షరీ మంత్రంతో భూలోకమంతా తిరుగుతుండగా ఒక భయంకరమైన రాక్షసుడు వామదేవుడి మీద పడ్డాడు .
🌿వామదేవుడు భయపడ లేదు . కానీ , రాక్షసుడికి మాత్రం వామదేవుణ్ణి పట్టుకోగానే ఇనుము స్వచ్ఛమై బంగారమైనట్లు , మానససరోవరంలో మునిగిన కాకి రాజహంస అయినట్లు ,
🌸అమృతం త్రాగిన మనిషికి దేవత్వం వచ్చినట్లు పాపాలన్నీ పూర్తిగా పోయి నిర్మలమైన మనస్సుతో మహ ! నా తప్పు క్షమించు నీవల్ల కలిగిన ఈ దివ్యత్వానికి నీకు కృతజ్ఞతలు అన్నాడు రాక్షసుడు .
🌿అసలు ఇలా ఎందుకయ్యావు ? అనడిగాడున వామదేవుడు . నేను పూర్వం యవన రాజ్యానికి రాజుగా వున్నప్పుడు చాలామంది స్త్రీలని బంధించి జైల్లో పెట్టాను .
🌸తర్వాత రకరకాల జన్మలెత్తి ఇప్పుడు రాక్షసుడుగా పుట్టి నీవల్ల మోక్షం పొందానని చెప్పాడు రాక్షసుడు . మహర్షీ ! ఇంతటి గొప్ప మహత్తు మీకు ఎలా వచ్చిందో చెప్పండని అడిగాడు రాక్షసుడు .
🌿శివుడికి ఇష్టమైందీ , భూషణంగా శివుడు ధరించేదీ అయిన పవిత్రమయిన విభూతి నా శరీరం మీద వుంది కాబట్టి అలా జరిగింది . ఇదంతా విభూతి చేసిన పనే కాని నాది కాదు .
🌸దాని గొప్పతనం ఒక త్రినేత్రుడికే తెలుసు . శ్రద్ధ , భయం , భక్తి కలిగి ఎవరు ఈ విభూతిని రాసుకుంటాడో అతడికి అన్ని పాపాలు నశిస్తాయని చెప్పాడు వామదేవుడు .
🌿రాక్షసుడు మహర్షికి నమస్కరించి వెళ్ళిపోయాడు . ఒకసారి నృగమహారాజు వేట కోసం వచ్చి అలిసిపోయి తనతో వచ్చిన వాళ్ళనుంచి తప్పిపోయి ఒక చెట్టుంద గుర్రాన్ని చెట్టుకు కట్టి కూర్చున్నాడు . ఇంతలో ఒక ఆటవికుడు
నాలుగువేల కిరాత సైన్యంతో వచ్చి రాజువాద యుద్ధానికి వచ్చాడు .
🌸అదే సమయంలో ఆ రాజులోంచి ఒక స్త్రీ వచ్చి వాళ్ళందర్నీ చంపేసింది . కాని ఇదంతా రాజుకి అర్థంకాక గుఱ్ఱమెక్కి వామదేవుడు ఆశ్రమానికి వెళ్ళి జరిగింది చెప్పి ఇదంతా ఏమిటని అడిగాడు . రాజా ! నువ్వు పూర్వ జన్మలో శూద్రుడివి . కాని బ్రాహ్మణులని గౌరవించి వాళ్ళు చెప్పినట్లు శ్రావణ శుద్ధ ద్వాదశినాడు బుద్ధ వ్రతం చేశావు .
🌿ఈ జన్మలో క్షత్రియుడుగా పుట్టడానికి , రాజ్యం రావడానికి ఇప్పుడు జరిగినదానికి అదే కారణం . స్త్రీ రూపంలో వచ్చి శత్రువుల్ని చంపింది కూడా ఆ బుద్ధ దేవతే అని చెప్పాడు వామదేవుడు .
🌸అయోధ్యరాజైన శల్యుడు వేటకి వెళ్ళి ఒక మృగం దొరక్క రథం మీద తిరుగుతుండగా సారధి గుర్రాలు అలిసిపోయాయి ఇంక తిరగలేవని చెప్పాడు . వాళ్ళు వామదేవుడినడిగి పనయిపోగానే ఇచ్చేస్తామని చెప్పి గుర్రాలు తెచ్చుకుని తిరిగి ఇవ్వకుండా ఇంటికి వెళ్ళిపోయారు .
🌿వామదేవుడు అడిగినా శల్యుడు గుర్రాలు ఇవ్వలేదు , నువ్వు నా ధనాన్ని ఎత్తుకుపోయావు కాబట్టి రాక్షసుల చేతుల్లో చస్తావని శల్యుణ్ణి శపించాడు వామదేవుడు . అలాగే రాక్షసులు ఆ రాజుని చంపేశారు . తర్వాత శల్యుడి తమ్ముడు తలుడు రాజయ్యాడు .
🌸తలుడు కూడా వామదేవుడి గుర్రాలు తిరిగి ఇవ్వక అడిగినందుకు వామదేవుణ్ణి చంపడానికి విషంతో వున్న బాణాన్ని వేశాడు . వామదేవుడు కోపంతో ఈ బాణం నీ కొడుకుని చంపుతుందన్నాడు . అది అలాగే చేసింది . తలుడు మళ్ళీ బాణం తియ్యబోతే అతడి చెయ్య కదల్లేదు .
🌿తలుడు బ్రతిమాలుకున్నాడు . అతడి భార్య పరుగెత్తుకు వచ్చి వామదేవుడి కాళ్ళమీద పడి క్షమించమని భర్తని మంచివాడుగా చేసి కొడుకుని బ్రతికించమని అడిగింది . వామదేవుడు అలాగే చేసి తన గుర్రాలు తీసుకుని వెళ్ళిపోయాడు .
[12/28, 12:59] +91 73963 92086: 🌸కోసలరాజయిన వసుమనుడు వామదేవ మహర్షిని రాజధర్మాల గురించి చెప్పమని అడిగాడు . రాజా ! ధర్మాన్ని మించిన వస్తువే లేదు .
🌿ధర్మప్రవర్తన ఉన్న రాజులందరూ చక్రవర్తులౌతున్నారు . ధనంకంటే ధర్మాన్ని ఎక్కువగా ఏ రాజు చూస్తాడో బాగుంటుంది . ధర్మం , దుర్గాన్ని సంరంక్షించుకోవడం , యుద్ధం చేయ్యడంలో నేర్పరితనం ,
రాచకార్యాల్ని వివేకంతో విచారించడం ,
🌸ప్రజలు సుఖంగా వుండేలా పాలించడం ఈ అయిదు వుంటే చాలు అని రాజధర్మాల్ని చెప్పాడు వామదేవుడు . దశరథమహారాజు ఆజ్ఞ ప్రకారం సీతారామలక్ష్మణులు అడవికి వెడుతుండగా అయోధ్య వాసులంతా ఏడుస్తూ రాముడి వెనకాల బయలుదేరారు .
🌿ఎంత చెప్పినా వినలేదు .
వామదేవుడు అయోధ్య వాసుల్ని ఉద్దేశించి ఇలా చెప్పాడు . శ్రీరాముడు ఆదినారాయణుడు , సీతమ్మ ఆదిమహాలక్ష్మి , లక్ష్మణుడు శేషావతారం . విష్ణుమూర్తి మొదట మత్స్యావతారం , తర్వాత కుర్మావతారం , వరాహావతారం , నృసింహావతారం , వామనావతారం , పరశురామావతారం ఎత్తి రాక్షసుల్ని దుష్టుల్ని ఎలా నాశనం చేశాడో ఇప్పుడు శ్రీరాముడిగా అవతారం ఎత్తి రావణుడు మొదలైన రాక్షసుల్ని చంపడానికి వెడుతున్నాడు .
🌸మీరు శ్రీరాముణ్ణి ఆశీర్వదించి పంపించాలేగాని , ఇలా ఏడుస్తూ పంపిస్తే ఆయన ఏ పనికోసం అవతారమెత్తి మన దగ్గరికి వచ్చాడో ఆపని నిర్వఘ్నంగా జరగదని నచ్చ చెప్పి వెనక్కి పంపాడు .
🌿పూర్వం సుబాహుడు అనే రాజు నారాయణ ధ్యానం చేస్తూండేవాడు . జైమిని మహర్షి రాజా ! దానాలు చేయ్యకపోతే ఆకలి బాధ కలుగుతుంది .
🌸ప్రతి మనిషి దానం తప్పకుండా చెయ్యాలని చెప్పినా వినలేదు సుబాహుడు , సుబాహుడు చనిపోయాక వైకుంఠం చేరాడు కాని అక్కడ తిండిలేక బాధలు పడుంటే వామదేవుణ్ణి ప్రార్ధించాడు .
🌿వామదేవుడు సుబాహుణ్ణి ధ్యానం ఉన్నా దానం తప్పదని చెప్తే నువ్వు వినలేదు . అన్నదానం అన్నింటికన్నా ముఖ్యమని చెప్తే అదీ చెయ్యలేదు . అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నావు అన్నాడు .
🌸ఈ బాధ కలగకుండా వుండాలంటే ఏఏ దానాలు చెయ్యాలనడిగాడు సుబాహుడు . అన్నదానం , ఉదకదానం , ఉదకపాత్ర దానం , భూదానం , గోదానం , సువర్ణ దానం , ఛత్ర దానం , ఉపాసహదానం అని వామదేవుడు చెప్పాడు .
🌿ఇప్పుడు ఈ బాధ ఎలా తీరుతుంది అని అడిగాడు సుబాహుడు . నువ్వు నీ భార్యతో సహా రోజూ భూలోకం వెళ్ళి మీ శవాలు అక్కడే వున్నాయి , తిని బ్రతకండి . ఏ రోజయితే శుకరాజు చెప్పిన వాసుదేవ స్తోత్రం వింటారో ఆరోజు మీకు పాపం నశిస్తుందని చెప్పి , శుకరాజుతో అతని కొడుక్కి వాసుదేవస్తోత్రం వినిపించి దాన్ని సుబాహు భార్యతో సహా వినేటట్లుగా చేసి వాళ్ళకి మంచి జరిగిలా చేశాడు .
🌸సుబాహుడికి భార్యకి శ్రీమహావిష్ణువు దర్శనం కలగడానికి కారకువయ్యాడు వామదేవుడు . ఈరకంగా వామదేవ మహర్షి భక్తియుక్తులయిన మహర్షులకి తరుణోపాయాలు చెప్తూ లోక కళ్యాణం కోసమే జీవించిన ధన్యుడు .
🌿వామదేవ మహర్షి కథ చదివారు కదా !! ఏ మహర్షిని గురించి చదివినా అందులో మంచిని తెలుసుకుని ఆచరణలో పెట్టాలన్నదే మన ఆశయం ..... !🌞🚩🙏🌹🎻
Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము..👍😊🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment