ఆత్మీయ బంధు మిత్రులకు బుధవారపు మరియు స్కంద షష్టి శుభాకాంక్షలు, విజ్ఞ నాయకుడు వినాయకుడు, శ్రీవల్లి దేవాసేన సమేతుడు సుబ్రహ్మణ్య స్వామి వారు హారిహరసూతుడు అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ
బుధవారం:-28-12-2022
ఈ రోజు AVB మంచి మాట..లు
చూడు మిత్రమా!!
మౌనం ఎప్పుడు చేతకానితనం కాదు, ఓర్పుగా ఉంటే ఓటమిని అంగీకరించినట్టు కాదు, కొన్నిసార్లు ప్రతి అడ్డమైన వాడితో పెట్టుకోవడం కంటే మౌనంగా ఒక అడుగు వెనకకు తగ్గడంలోనే మంచి రిజల్ట్ ఉంటుంది,,
ఎద్దు నిలకడ లేకపోతే పంటకి మాత్రమే నష్టం,, కానీ మనిషి బుద్ధి నిలకడగా లేకపోతే మొత్తం జీవితానికే నష్టం,,
జీవితంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోండి,, ఒకరు మనకు చేసిన సహాయాన్ని మరిచిపోకూడదు, ఒకరు మనకు చేసిన నమ్మకద్రోహాన్ని కూడా మరిచిపోకూడదు, ఏదో ఒకరోజు ఎవరి రుణాన్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేయ్యాలి కదా వడ్డీతో సహా,,
జీవితంలో ఒకటి గుర్తుంచుకో,, మనకు అన్నం పెట్టిన వారు పెట్టి మరిచిపోవచ్చు కానీ అన్నం తిన్న మనం మరిచిపోకూడదు, మనకు సహయం చేసిన వారు చేసి మరిచిపోవచ్చు కానీ సహాయం పొందిన మనం మరిచిపోకూడదు, అలా మరిచిపోయిన నాడు ఆ భగవంతుడు మనల్ని క్షమించడు,,
అజ్ఞాని ఆవేశంతో ఆలోచించి వేటాడే ప్రయత్నం చేస్తాడు, కానీ వివేకవంతుడు విజ్ఞతతో కార్యం పూర్తిచేసుకుంటాడు, పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు స్తబ్దుగా ఉండి సందర్భం రాగానే చెలరేగి పోవడం సమర్థుడి లక్షణం,,
🕉️AVB సుబ్బారావు ✒️
📱9985255805🚩
No comments:
Post a Comment