నేటి మంచి మాట.
నీ కారణంగా, నీ జీవిత కాలం మొత్తంలో, కనీసం ఒక్కరి జీవితమైనా మారితే నీ జన్మ ధన్యమైనట్టే కదూ?!
అది నీ మాటల వలన కావచ్చు, నీ ధన సహాయం వలన కావచ్చు, నీవు చేసే పని వలన కావచ్చు, నీవందించే సేవలవలన కావచ్చు, నీతో భాగస్వామ్యం వలన కావచ్చు, లేదా కొన్నిసార్లు నీతో జరిగిన సంఘర్షణలవలన కూడా కావచ్చు. అంటే, నీ ఉనికి, నీ కదలిక, నీ ఆలోచన, నీ మాట లేదా నువ్వు చేసే పని, ఏదైనా ఏదో ఒక విధంగా ఇతరులను ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావం నీకు కొన్ని సార్లు తెలియచ్చు, తెలియకపోవచ్చు. అందుకే ఆ ప్రభావం సరైనదిగా ఉండాలంటే నువ్వు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.
శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానససరోవరం👏
No comments:
Post a Comment