*::::::::అద్దం vs మనస్సు::::::*
1) రెండూ కూడా తన ఎదురుగా వున్న వాటిని ప్రతిబింబిస్తాయి.
2)అద్దం యథా భూతంగా
ప్రతిబింబిస్తే, మనస్సు భావరూపంలో ప్రతిబింబిస్తుంది.
3)అద్దం భౌతిక మైనది అయితే , మనస్సు సజీవ మైనవి.
4)అద్దానికి స్వాతంత్ర్యం లేదు.అది ప్రతిబింబిచాల్సిందే.
మనస్సుకు ఇష్టానిష్టాలు వున్నాయి.
5) అద్దం యాంత్రికంగా ప్రతిబింబిస్తుంది. మనస్సు ప్రతిబింబిచటంతో పాటు అనుభూతి చెందుతుంది.
6)అద్దానికి జ్ఞాపక శక్తి లేదు.
మనస్సు కు జ్ఞాపక శక్తి వుంది.
7)అద్దం బ్రాంతి కి లోను కాదు.కాని మనస్సు ఉన్నది ఒకటైతే మరోలాగా అర్ధం చేసుకోవచ్చు.పొరపడ వచ్చు.
8)అద్దం తను ప్రతిబింబించే వస్తువులు మధ్య వున్న సంబంధాన్ని పసిగట్ట లేదు.
ఈ పని మనస్సు చేయగలదు.
9) ధ్యానం లో మనస్సు తనను తాను దర్శించుకో గలదు.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment