Thursday, December 22, 2022

ప్రశ్న: కేవల నిర్వికల్ప సమాధీ, సహజ నిర్వికల్ప సమాధీ అంటే ఏమిటి ?

 *"అమర చైతన్యం"* 
*( శ్రీ రమణ మహర్షి బోధనలు )*

*ప్రశ్న: కేవల నిర్వికల్ప సమాధీ, సహజ నిర్వికల్ప సమాధీ అంటే ఏమిటి ?*

*జవాబు: మనస్సు ధ్వంసం కాకపోయినా ఆత్మలో నిమజ్జనమవటం కేవల నిర్వికల్ప సమాధి. ఆ స్థితిలో వ్యక్తికి ఇంకా వాసనలుంటాయి. అందువల్ల ముక్తిని పొందడు. వాసనలు నాశనమైన తరువాతనే ముక్తి సంభవం.*

*ప్రశ్న: సవికల్ప, నిర్వికల్ప సమాధుల తేడా ఏమిటో స్పష్టంగా తెలుయజేయండి ?*

*జవాబు: పరమోత్కృష్టమైన స్థితిని అంటిపెట్టుకుని ఉండటం సమాధి. ఈ స్థితి, ప్రయత్నం వల్లనే సాధ్యమైతే దానిని సవికల్ప సమాధి అంటారు. మానసిక అలజడులు లేకపోతే, నిర్వికల్ప సమాధి. ఏ ప్రయత్నమూ లేకుండా ఆదిమ స్థితిలో శాశ్వతంగా ఉండటం, సహజ సమాధి.

No comments:

Post a Comment