Monday, December 19, 2022

అందం అనేదానిని వ్యక్తుల ముఖారవిందాల్లో వెతుకుతుంది లోకం.

 191222a0517.     201222-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀703.
నేటి…

             ఆచార్య సద్బోధన:
                 ➖➖➖✍️

అందం అనేదానిని వ్యక్తుల ముఖారవిందాల్లో వెతుకుతుంది లోకం. 

కానీ పదిమందికి సాయం చేయడానికి ఉరుకులు, పరుగులు తీసే పాదాల్లోనే నిజమైన అందం ఉందంటాడు భగవంతుడు.

ఒక వ్యక్తి తనకి, తన కుటుంబానికి అంతా కావాలనుకునేవాడు పైకి ఎంత అందగాడైనా పరమ వికారే అంటాడు దేవుడు. 

ప్రక్కవాడికి, పదిమందికి లాభం కలగాలని ప్రాకులాడేవాడు పరమ వికారంగా ఉన్నా అతడు నా దృష్టిలో గొప్ప అందగాడు అంటాడు భగవంతుడు.

శక్తి ఉండి కూడా  దీనులకు చేయూత నివ్వనివాడు, సాకులు వెతుకువాడు లోకం దృష్టిలో మన్మధుడైనా తన దృష్టిలో  మాత్రం పరమ వికార రూపుడే  అంటాడు భగవంతుడు.

ఇప్పటి వరకు మనం ఏ జాబితాలో  చేరి ఉన్నామో, ఇక ముందు ఏ జాబితాలో చేరదలచుకుంటామో బాగుగా అలోచన చేసుకోవాలని కూడా భగవంతుడు మనలను హెచ్చరిస్తున్నాడు.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

No comments:

Post a Comment