Friday, December 23, 2022

ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికీ ఒక లక్ష్యం ఉండాలి. ఈ లక్ష్యం సాధించడానికి తగినంత కృషి చేయవలసిన బాధ్యత వ్యక్తి మీద తప్పక ఉంటుంది.

 221222a1924.   231222-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀706.
నేటి…

             *ఆచార్య సద్బోధన:*
                ➖➖➖✍️

*ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికీ ఒక లక్ష్యం ఉండాలి. ఈ లక్ష్యం  సాధించడానికి తగినంత కృషి చేయవలసిన బాధ్యత వ్యక్తి మీద తప్పక ఉంటుంది.* 

*చదువు, వ్యాపారం, ఉద్యోగం, కుటుంబ నిర్వహణ, ఆర్థిక వనరుల నిర్వహణ తదితర రంగాల్లో అనుకున్న లక్ష్యం చేరాలనుకుంటే ఒక తపన, బలమైన కోరిక అవసరం.*

*ఏదీ దానికదే వస్తుంది అనుకోకూడదు. అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు అని పనిపాట, ప్రయత్నం చేయనివారు మారితీరాలి.*

*గాలిలో దీపం పెట్టి 'దేవుడా నీదే భారం' అన్నట్లుగా ప్రయత్నం చేయకుండా లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకోవడం మూర్ఖత్వం.*

*సరైన ప్రయత్నం చేయని వారికి భగవంతుడు సహాయం చేయడమనేది అసాధ్యం!* 

*దానికి ఆయనను తప్పు పట్టడం కూడని పని. నిజానికి మనకి సహాయ పడడానికి భగవంతుడు ఎల్లవేళలా సిద్ధంగానే ఉన్నాడు.*

*కానీ మనలో ప్రయత్నం, ప్రణాళిక లేకపోతే ఆయన మాత్రం ఏమి చేయగలడు?* 

*అన్నీ మీరే చేసేయండి, నేను తిని, తిరిగి నిద్రపోతాను అంటే కుదురుతుందా?*

*లేదు, లేచి ప్రయత్నం చేయాలి. దేవుణ్ణి నమ్మాలి. అప్పుడే ఏ సహయము కావాలన్నా  మనకు ఆయన నుండి తప్పక అందుతుంది.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment