Friday, December 23, 2022

****ప్రాణ మనస్సులను చైతన్యంలో నిలిపి ఉంచటమే ధ్యానం.

 హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ:🙏

ప్రారబ్ద వేగం ఉన్నంతవరకు అభేదర్శనం సిధ్ధించలేదు అర్జుననకు. 

లోపల ఒక స్మృతి సాగరాన్ని సృష్టించి స్వరూపాన్ని మరపుకు తెస్తుంది ...

జ్ఞాపకాలనే స్మృతి సాగరాన్ని ఖాళీ చేయడానికి సహాయపడేవాడు గురువు. 

ప్రాణమున్నదేనినైనా నారాయణునిగా చూడాలి. ..

తనలో ఉన్న ముఖ్యప్రాణాన్ని గుర్తించ గలిగిన వాడు నారాయణ దర్శనాన్ని పొందుతాడు ... ఇదే వైకుంఠ ప్రాప్తి. 

ఎక్కడ కదలిక ఉన్నదో అక్కడ చైతన్యం ఉన్నది ... చైతన్యం ఉన్నచోట నారాయణుడున్నాడు. 

నిద్ర కాని నిద్ర నిర్నిద్ర .. జ్ఞాని నిద్ర 
యోగులు యోగ నిద్ర. 

విశ్వం నీకు మూలా ప్రకృతి ... మధ్య స్థానలో విశ్వమంతా వ్యాపకమై .. కదలకుండా ఉన్నవాడు విష్ణు మూర్తి. 

వ్యాపక మైనదంతా ఇంద్రియాతీతమైనది. 

ఈశ్వరార్పణ బుధ్ధితో చేస్తేనే ... నిష్కామ కర్మ వల్లనే సంసారం లేని దవుతుంది. 

నిర్విషయం .. నిర్వాణం.. నిస్సంకల్పం.. నిర్వికల్పం ... స్థిత ప్రజ్ఞత సాధించడం వల్ల ఈ నాలుగు స్థితులు పొందవచ్చు. 

లేనిది లేకనే పోతుందనే సత్యాన్ని గుర్తించాలంటే ... ఉన్నదానిని గుర్తిస్తేనే కదా .. 

నిర్గుణ నిరాకారాన్ని సగుణ సాకారం గా అందించే ప్రయత్నం చేస్తుంది పురాణం ...సగుణ సాకారాన్ని నిర్గుణ నిరాకారంగా అందించేది ఉపనిషత్ ...

ఎక్కడ వాక్కు మనస్సు ... వెనుతిరిగినాయో ... ఇంద్రియములు విరమించినాయో 
అది మాత్రమే ఉన్నదో .. అది పరమాత్మ. 

ప్రాణ మనస్సులను చైతన్యంలో నిలిపి ఉంచటమే ధ్యానం. 

శ్రీ విద్యా సాగర్ స్వామి వారు 
గురుగీత..37

జై గురుదేవ 🙏

No comments:

Post a Comment