నిప్పును గడ్డి వాములో దాయడం జరిగే పని కాదు... కొన్ని నిమిషాలు తర్వాత వాము కాలడం, బూడిద కావడం సత్యం... అలాగే అధ్యాత్మిక సత్యాన్ని కొందరు వ్యక్తిగత రంగులు పులిమి సామాన్యులకు అర్దం కాని విధంగా చేసే ప్రచారాలు కూడా గడ్డి వాము లాంటివే.. అనుభవాలు అర్థవంతంగా ఉంటేనే పత్రీజీ గురువు గారు అనుమతించేవారు అనే అధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకోవాలి... మూడు గంటల సాధన మూడు నిమిషాలు లాగా అనిపించాయి అంటే ఎరుక కన్నా నిద్ర పోయారు అని తెలుసుకోవాలి... అర్దం పర్ధం లేని అనుభవాలు చెప్పడం ద్వారా ఎదుటి వారి సమయాన్ని దుర్వినియోగం చేయకండి... పెద్దలకు అవకాశం ఇస్తే చెప్పిందే చెప్పడం, తానే ఎదో గొప్పవారు లాగా చేతులు ఎత్త మనడం చాలా చోట్ల జరుగుతూంది.. అలాంటి వారు కొద్దిగా ఎరుకతో మాట్లాడండి...సాధనలో కావలసింది క్వాంటిటీ సాధన కాదు క్వాలిటీ ధ్యానము.. శ్వాస ను గమనిస్తూ జరిగే పరిణామాలు ఎరుక స్థితిలో గమనిస్తూ ఉంటే శ్వాస గతి మారిపోయి అనగా ముక్కుతో తీసుకునే శ్వాస ఊపిరితిత్తల వరకు మాత్రమే ప్రయాణం కొనసాగిస్తుంది... శ్వాస మీద ధ్యాస ద్వారా శ్వాస మరియు ఆలోచనలు లేని స్థితిలో శ్వాస గతి మారిపోయి మూలాధారం నుండి సహస్రారం వరకు క్రిందకు పైకి ప్రయాణం కొనసాగిస్తుంది... అలాగే విస్వమయ ప్రాణశక్తి శ్వాస మరియు ఆలోచనలు లేని స్థితిలో మాత్రమే శరీరంలోకి ప్రవేశిస్తుంది... అపుడు మాత్రమే నాడీ మండలం శుద్ధి జరుగుతుంది అపుడు మాత్రమే జన్మ జన్మల చెడు కర్మలు దగ్దం.
వైకుంఠ ద్వారాలు అనేవి సరైన సాధన ద్వారా మాత్రమే తెరుసుకుంటాయి..
పసుపుల పుల్లారావు,ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రం
9849163616
No comments:
Post a Comment