🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*మంచి మాటలు *
➖➖➖✍️
* *మనలో చాలామంది బలహీనులం అవుతున్నది డబ్బు లేక అనుకుంటూ ఉంటాం...! కానీ... బలమైన తోడులేక అని తెలుసుకోలేక పోతున్నాం... ఒక దృఢమైన తోడు ఎంతో బలాన్నిస్తుంది మనకు....!!*
**తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు..!తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడడం.... గొప్ప విషయం....!!*
**పూర్వం మనుషులు భావుకులుగా ఉండేవారు. బంధాలను, బాధ్యతలను నిర్వర్తించే వారు. తర్వాత ప్రాక్టికల్ గా అయ్యారు. బంధాలను సొంత లాభానికి ఉపయోగించేవారు... ఇప్పుడు ప్రొఫెషనల్ గా మారారు. లాభం ఉండే బంధాలను మాత్రమే స్వీకరిస్తున్నారు.*
**విలువలంటే... జనాలకు మాటలు చెప్పి తప్పించుకోవడం కాదు.. జన్మంతా విలువల కోసం కట్టుబడటం....!!*
**జీవితం అనుకున్నంత సులభం కాదు, కొన్నిసార్లు ఏ తప్పు చేయకపోయినా తప్పక శిక్ష అనుభవించాలి....!!*
**మీకు తెలియని దాని గురించి మాట్లాడకండి! మీదే కరెక్ట్ అని వాదించకండి. మీ వాదన మీలో ఉన్న అజ్ఞానాన్ని ఎదుటివారికి కళ్ళకు కట్టినట్టు చెప్తుంది..!!*
**అసూయపడే వారితో మన అభివృద్ధి గురించి చెప్పుకోవడం, ఆవేశపడే వారితో మన ఆలోచనలను పంచుకోవటం మూర్ఖత్వం..!!*
**మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులు చేయక్కరలేదు ఎదుటివారి గురించి ముందొక మాట వెనుకొక మాట మాట్లాడకుంటే చాలు....!!*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment