*::::: జ్ఞాపకాలు రెండు రకాలు :::::::*
1) విషయాలకు చెందినవిగా వుండి మనకు కావాలంటే గుర్తుకు వచ్చేవి.
2) విషయాలతో ముడిపడిన భావోద్వేగ జ్ఞాపకం. అనగా మానసిక జ్ఞాపకం.
ఉదా. నేను దారిలో నడుస్తూ ఉంటే కుక్క వెంట పడింది. నాకు భయం వేసి పరిగెత్తి తప్పించు కున్నాను.
1)ఈసంఘటన జ్ఞాపకంగా వుండిపోయింది. ఈ రకంగా సంఘటనలు, విషయాలు, సమాచారం,చదివింది, విన్నది , చూచింది జ్ఞాపకంగా వుంటుంది. ఇది సహజం,
2) కుక్క వెంట పడింది. ఆ సంఘటన నాకు గుర్తుకు వచ్చింది. అలా గుర్తుకు రావటమే కాక ఇప్పుడు నాకు భయం కూడా వేస్తోంది. (ఇప్పుడు నా ఎదురుగా కుక్క లేదు అయినా సరే)
దీనిని మానసిక జ్ఞాపకం అంటారు. ఇప్పుడు నాకు భయం కలగడం అసమంజసం.
అసందర్భం.( కుక్క ను చూస్తే కలగ వలసిన భయం తలచు కుంటే కలుగుతుంది )
*ధ్యానం మానసిక జ్ఞాపకాలను చెరిపి వేస్తుంది*
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment