💖💖💖
💖💖 *"449"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"అసలు ధ్యానం ఎందుకు చేయాలి ? అలా మనసును కష్టపెట్టకుండా ఆ స్థితి సహజంగా తెలియదా !?"*
*"ధ్యానం ఎందుకు చేయాలంటే మనకి కోరిక లేని స్థితిలో ఉండే ఆనందం తెలియడం కోసం. వస్తువులతో, విషయాలతో వచ్చే ఆనందమే మనకి తెలుసు. అది వాటితో సంబంధం పెట్టుకుంటే గాని రాదు. కానీ ఏ సంబంధమైనా శాశ్వతంగా ఉండదు. కనుక ఆనందం కూడా శాశ్వతంగా ఉండటంలేదు. ధ్యానంలో ఏమీ కోరాలనిపించదు. ఎందుకంటే అక్కడ అనుభవం తప్ప ఆశలేదు. ఇప్పుడు మనం దేన్నయితే నేను, నేను అంటున్నామో అది మనలోని ఆశపరుడికి మనం పెట్టుకున్న పేరు. ఆశపరుడు లేకపోయినా అనుభవం ఉంటుంది. అదే ధ్యానస్థితిలో జరుగుతుంది. మనలోని ఆశపరుడే నేనుగా, అహంకారంగా, మాయగా ఉన్నాడన్న విషయం మనకు ధ్యానంలో తెలుస్తుంది. సృష్టిలో వస్తువుల నుండి ఏది ఆశించకపోయినా మనకు వచ్చే శాంతి మనకి అందుతూనే ఉంది. ఈ విషయం సాధకుడు ధ్యానస్థితిలో తెలుసుకుంటాడు. ప్రతి ఒక్కరూ సాధన చేసి ఈ విషయాన్ని తెలుసుకోలేక పోయినా దాన్ని ప్రత్యక్షంగా అనుభవించి, బోధించే గురువు మాటలు విశ్వసించి అనుసరించినా చాలు !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment