*ఎవరు అదృష్టవంతులు*
సముద్రంలో చేపల వేట కోసం ఓ జాలరి పడవలో బయలుదేరాడు. అతని వెంట పదహారేళ్ల కొడుకు వెళ్లాడు. దగ్గర్లో చేపలు దొరకకపోవడంతో సముద్రంలో చాలా దూరం వెళ్లారు. సమీపంలో చిన్న దీవి కనిపించింది దాంతో అక్కడ విశ్రాంతి తీసుకుందామని తీరానికి చేరుకున్నారు. అక్కడ సమీపంలో ఇద్దరు విదేశీయులు ఇసుక తిన్నెలపై పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆహా జీవితమంటే వీళ్ళదే విహారం కోసం ఎక్కడి నుంచో ఇంత దూరం వచ్చారు అనుకున్నాడు జాలరి కొడుకు. వారిని ఆసక్తిగా చూస్తూ ఉండిపోయాడు. అది గమనించిన ఒక విదేశీయుడు అతన్ని దగ్గరికి రమ్మని పిలిచాడు వాళ్ళ దగ్గర ఉన్న బాదంపప్పు ఇచ్చాడు. వాటిని తీసుకుంటూ మీరు ఎంత అదృష్టవంతులు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు అన్నాడు జాలరి కొడుకు. దానికి విదేశీయుడు చిన్నగా నవ్వి నీకు అలా అర్థం అయ్యిందా మా దేశాలలో చలి ఎక్కువ సూర్యుడు కొంత సమయమే ఉంటాడు సరిపడా సూర్యరశ్మి సోకక పోవడంతో మాలో చాలామంది ఎముకలు, కండరాలు, చర్మ సంబంధిత సమస్యలతో సతమతమవుతుంటారు. అలాంటి రుగ్మతల బారిన పడకుండా శరీరానికి సరిపడా సూర్యరశ్మి కోసం ఇలా ఉష్ణ మండలాల విహారానికి వస్తుంటాము. ఎండలు మెండుగా ఉండే ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఎంత అదృష్టవంతులు అని భావిస్తుంటాం అన్నాడు విదేశీయుడు. ఆ సమాధానం విని జాలరి కొడుకు ఆశ్చర్యపోయాడు. ఒడ్డున ఉన్నవారు నీళ్లలో ఉన్న వారు ఆనందంగా ఉన్నారని, నీళ్ళల్లో ఉన్నవారు ఒడ్డున ఉన్నవాళ్లు అదృష్టవంతులని భావించడం మానవ నైజం అని అతనికి అర్థం అయింది. పీత కష్టాలు పీతవి అనుకుంటూ చేపల వేట కోసం తండ్రితో కలిసి సముద్రంలోకి వెళ్ళాడు.
*ఎవరికి ఉన్నంతలో వాళ్లు సంతృప్తికరంగా ఉండాలి, ప్రక్క వాళ్ళని చూసి అసూయ పడకూడదు, ఎవరికి వారు అదృష్టవంతులే*
*సర్వేజనా సుఖినోభవంతు*
🙏🏽🙏🏼🙏🏽
No comments:
Post a Comment