0201. 2-4. 250123-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*నిష్కామ కర్మ*
➖➖➖✍️
*భగవంతుడు భగ్వద్గీతలో - ‘నిష్కామ కర్మ’ గూర్చి చెబుతారు, భగ్వద్ అనుగ్రహము కావాలంటే చాలా గ్రంధాలలో కూడా ఈ ‘నిష్కామ కర్మ’ గూర్చి ఉంది, నిష్కామ కర్మ వలన(ఫలితం ఆశించని) ఎటువంటి కర్మ ఫలము అంటదు...!*
*అదేంటో , ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకొందాము!!!*
*ఒకానొక సమయములో, దూర్వాస మహర్షి యమునా నది దాటివచ్చి, భక్తితో గోపికలు సమర్పించిన ఫలములను, వాళ్ల సమక్షమున ఆరగించి, వారిని ఆశీర్వదించాడు.*
*ఇంతలో యమునా నది పొంగడం వలన, ఆ గోపికలు తిరిగి వెళ్ళే మార్గం లేక దూర్వాస మహర్షి సహాయాన్ని అర్ధించారు.*
*ఆ మహర్షి, వారితో యమునా నదిని ఈవిధంగా ప్రార్ధించమన్నాడు...*
*"ఓ యమునా మాతా! ఈ దూర్వాస మహర్షి ఈనాడు ఉపవాస దీక్ష పాటించి ఉండి నట్లయితే, దయతో మాకు ఆవలి ఒడ్డుకు చేరే దారినియ్యి!" అని.*
*తమ ఎదుటే భుజించిన మహర్షి కి, ఉపవాస దీక్ష ఏమిటి? అనుకుని గోపికలు నిర్గాంత పోయారు!!...*
*అయినా మహర్షి మహిమ దృష్టి లో ఉంచుకుని, మారు మాట్లాడకుండా యమునను ఆ విధంగా ప్రార్థించారు.*
*యమునా నది వెంటనే గోపికలకు త్రోవఇచ్చింది, దూర్వాస మహర్షి కేవలం గోపికల భక్తికి మెచ్చి, వారిని ఆనంద పరచడానికి పండ్లు ఆరగించాడే తప్ప, వాటిపై వ్యామోహం తో కాదు. ఆకలితో కాదు, మనస్సును, ఇంద్రియాలను జయించినవారికి, ఆకలి దప్పులు ఉండవు.*
*ఈశ్వరార్పణ భావంతో చేసిన ఆ కర్మకు అతడు కర్త కాదు, కేవలం సాక్షీభూతుడు, అందువల్ల అతనికి ఆ కర్మకు ఫలం అంట లేదు.*
*అలానే ఈనాడు కలియుగంలో ఏది చేసినా, అది భగవంతునికి అర్పితం చేయాలి!*
*ఎవరైనా ఇంతపని ఎలా చేసావు, ఎలా సాధ్యమైనది, అని అడిగినప్పుడు ‘అంతా ఈశ్వర సంకల్పం మాత్రమే, నేను నిమిత్తమాత్రుడిని, ఆయన దయ ఉంటే అన్నీ సాధ్యమే!’ అనే మాట చెప్పి, మన భావం కూడా అలానే ఉండాలి... అప్పుడే ఆ సర్వేశ్వరుడు - మంచి ఫలితం మనకు ఇచ్చి, దానిలో ఉన్న చెడును హలాహలం లాగా తాను స్వీకరిస్తాడు.*
*అప్పుడే అది నిష్కామ కర్మ అవుతుంది..!*
*ఈరోజు మనం, మంచి జరిగితే నేను, చెడు అయితే దేవుడు అని అనుకొని మాయలో పడుతున్నాము ...*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment