*సర్వం బ్రహ్మమయం*
మానవ సృష్టికి మొదటి మానవుడు - *బ్రహ్మా*
ప్రజలందరికీ తండ్రి - *ప్రజాపిత బ్రహ్మా*
అన్నింటికంటే గొప్ప విద్య - *బ్రహ్మా విద్య*
బ్రహ్మా జ్ఞానాన్ని ఆచరించేవాడు. - *బ్రహ్మాచారి.*
బ్రహ్మాజ్ఞానాన్ని కర్మేంద్రియాల ద్వారా చూపడమే *బ్రహ్మచర్యము.*
అన్నిటికంటే గొప్ప ముహూర్తం - *బ్రహ్మాముహూర్తం.*
అన్ని ఉత్సవాలలో కెల్లా గొప్పది - *బ్రహ్మోత్సవం.*
*అతిగొప్ప ప్రయత్నం - బ్రహ్మ ప్రయత్నం*
ఈ రాతను ఎవరూ చెడుపలేరు - *బ్రహ్మరాత.*
ఈ ముడిని ఎవరు విప్పలేరు - *బ్రహ్మముడి.*
ఈ అస్త్రానికి తిరుగులేదు - *బ్రహ్మాస్త్రం.*
అతి చెవుడు ఉంటే - *బ్రహ్మ చెవుడు*
ఏదైనా గొప్ప రహస్యం - *బ్రహ్మ రహస్యం*
ఎవరికైనా గొప్పగా ఆహ్వానం పలికితే ఏమి పట్టారు అంటారు? - *బ్రహ్మరథం*
గొప్ప రాక్షసిని ఏమంటారు? - *బ్రహ్మ రాక్షసి*
ఏదైనా తినేది రుచిగా ఉంటే
ఏమని అంటారు? - *బ్రహ్మాండం*
బాలవాక్కుని ఏమంటారు ? *బ్రహ్మవాక్కు*
ఏ దేవుడు దిగివచ్చినా వీరు మారరు
అంటారు? - *బ్రహ్మదేవుడు*
సరస్వతి కి మరొక పేరు - *బ్రహ్మ మానస పుత్రిక*
స్వర్గానికి మరొక పేరు - *బ్రహ్మాపగలు*
నరకానికి మరొక పేరు - *బ్రహ్మ రాత్రి*
ఆనందంలో కెల్లా గొప్ప ఆనందం_. *బ్రహ్మానందం*
అన్నింటికంటే గొప్ప ఉపదేశం - *బ్రహ్మోపదేశం*
అన్నింటికంటే పెద్ద నది - *బ్రహ్మపుత్రా నది*
అందుకే సర్వం బ్రహ్మ మయం..🙏🕉️🙏
🔯🔯✡️☑️✔️
No comments:
Post a Comment