విజయవాడ పట్టణంలో 108 రోజులు శాఖాహార ర్యాలీలు అద్భుతంగా జరిపి నేడు విజయోత్సవం జరుపుకోబోతున్న పిరమిడ్ మాస్టర్స్ కి వందనం అభివందనం.
ఒక జీవిని చంపి
మెడ కోసి
తల నరికి
వెంట్రుకలు పీకేసి
కాళ్ళు మెలేసి
పేగులు లాగేసి
ముక్కలు ముక్కలుగా చేసి
కారం పూసి
నిప్పుల్లో కాల్చి
మంటల్లో మాడ్చి
ఉప్పు దట్టించి
మసాలాలు పట్టించి
నూనెలో వేయించి
కూర పేరుతో
దేవుడి పేరు పెట్టి
దేవత పేరు చెప్పి
ఎంతో పరమ పవిత్రమైన
మనిషి పొట్టలో వేయ వచ్చా?
మనిషి పొట్ట ఏం స్మశానమా?
ఒక జీవిని మరో జీవి తింటే
అది హింస కాదా
రోగం రాదా
భాధలు కలగవా
దుఖాలు రావా
కష్టాలు కూడవా
నష్టాలు రావా
కరోనా భాదించదా ?
ఏ చట్టం చెప్పింది తినమని
ఏ దైవం కోరింది నాకు పెట్టమని
ఏ గ్రంధంలో రాసి వుంది
ఒక జీవిని మరో జీవి తినమని
భైబిల్ లో రాశారా
ఖురాన్ లో కనిపించిందా
భారతంలో చెప్పారా ?
ఓ మానవా ఇకనైనా ఆలోచించవా
మూగ జీవిని కరుణించవా
ఒక్కసారి వినవా
కళ్ళు మూసుకుని
హాయిగా కూర్చుని
ద్యానించవా ?
ఇది న్యాయమని
ఇది ధర్మమని
ఇది సత్యమని
నీకు తప్ప మరే జీవికి తెలుసు?
నిజమనిపిస్తే మానేయి
కాదనిపిస్తే వదిలేయి !
ఇట్లు
ఒక మానవ జీవి
ధ్యాన పిపాసి
అహింసా వాసి
అన్ని జీవరాశుల శుభాభిలాషి
శాకాహార అభిలాషి
🍇🍇🥒🥒🍉🍉🥑🥑🍅🍅🍇
No comments:
Post a Comment