ఆత్మీయ బంధు మిత్రులకు బుధవారపు శుభోదయం శుభాకాంక్షలు ప్రథమ పూజ్యులు వినాయకుడు , శ్రీవల్లి దేవసేన సమేత తిరుత్తని సుబ్రమణ్య స్వామివారు హరి హర సుతుడు అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
*బుధవారం--: 25-01-2023 :--*
ఈ రోజు *AVB* మంచి మాట..లు
మనం మనసులో ఒక *ఆలోచన* నాటితే అది *పనిగా* పెరుగుతుంది.. అదే *పని చేయటం* మొదలు పెడితే అది ఒక *అలవాటుగా* మారుతుంది.. అలవాటును క్రమబద్ధంగా *ఆచరిస్తే* మీ *వ్యక్తిత్వం* పెరుగుతుంది. మీ *వ్యక్తిత్వం* బాగుంటే మీ *తలరాత* మారుతుంది..అర్థమైందిగా *మన తలరాతను* మనమే రాసుకోవచ్చు👍
మనస్సులో *కల్మషం* లేని వారు మన ముందైనా వెనకైనా *ఒకేలా* మాట్లాడుతారు *ఒంటి నిండా విషము* నింపుకొని ఉన్నవారు మన ముందు *తియ్యగా* మన వెనుకాల *చేదుగా* మాట్లాడుతారు, ఒకటి మాత్రం *జాగర్త గా గమనించాలి సింహంతో *స్నేహం* చేసుకోవచ్చు కానీ ! గుంట నక్కతో *దోస్తీ అత్యంత ప్రమాదకరం* .
బంధాలు నిలవాలంటే మనలో *క్షమించే గుణం* ఉండాలి . బంధుత్వాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి *గౌరవం* ఉండాలి , ప్రేమలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి *నమ్మకండాలి* . నలుగురితో కలిసుండాలంటే చిన్ని *నవ్వుతో* పలకరింపులు ఉండాలి ఏది *నిర్లక్ష్యం* చేసినా బంధంలో *బలం* లేకుండా పోతుంది .
మనం బాద *పడితే* మనల్ని *ఓదార్చే* వాళ్ళు కొందరు , మనం ఎప్పుడూ *బాధ పడతామా* అని ఎదురుచూసే వాళ్ళు మరి కొందరు,మనతో ఏ *బంధం* లేక పోయినా మన *ఆనందాన్ని* తమ *ఆనందంగా* భావించేవాళ్ళు *నూటికో కోటికో ఒక్కరే* ఉంటారు . అలాంటి వారు మనకు తారసపడితే *ఎంత కష్టం* వచ్చినా వాళ్ళని *వదులుకోకూడదు*
సేకరణ ✒️*మీ ...AVB సుబ్బారావు
No comments:
Post a Comment