*:::::: ఆస్తులు రెండు రకాలు :::::::::*
1) *ప్రోగు చేసేవి.*
2) *ప్రోది చేసేవి*.(పోషణ)
1 *ప్రోగు చేసేవి* మనం అనేక రకాలైన ఆస్తులను సంపాదించి ,కూడ బెట్టి ప్రోగు చేస్తాం. నగలని, భూములని, విల్లా లని, పొలా లని, ఇందుకు నానా గడ్డి కరుస్తాము. మోసం, దోపిడి, కబ్జా, స్కాం,,శీలం పోయినా పర్వాలేదు.
2) *ప్రోది ( పోషణ) చేసేవి*
మనం మనస్సు కి శిక్షణ ఇచ్చి క్రింది ఆస్తులను సాధన ద్వారా పెంచి పోషించు కుంటాము.
*శీలం* మంచి మాట, మంచి ప్రవర్తన, మంచి తనం, వీటిని ఆచరిస్తాము. ఇది మనలను ఇతరులను ప్రశాంతంగా వుంచుతుంది.
*స్నేహం* మనం ఇతరులతో ఎలాంటి వివక్షలు లేక స్నేహం గా మెసులుతాము. దీని వల్ల మానవ సంబంధాలు మానవీయంగా మారతాయి.
*సతి* ఎల్లవేళలా సతి(ఎరుక) కలిగి వుంటాము. ఇది రాగ ద్వేష మోహాలకు గురి కానివ్వదు.
*ప్రజ్ఞ* సరైన అవగాహన, మరియి సరైన దృష్టి ని కలిగినదై మనలను దుఃఖం పారిన పడ నివ్వదు.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment