Thursday, January 5, 2023

::::::చర్యలు లేదా పనులు:::::

 *చర్యలు లేదా పనులు*

     మన చుట్టూ అనేక సంఘటనలు చోటు చేసుకుంటూ వుంటాయి. ఈ సంఘటనల పట్ల మన వైఖరి రెండు రకాలుగా వుంటుంది.
    1) *నిస్వార్ధం* ఆ జరుగుతూ వున్న  సంఘటన మన పరిశీలన లోకి వచ్చినప్పుడు ,మన జోక్యాన్ని కోరుతూవుందని మనస్సు నిస్వార్ధంగా గ్రహించి తగు చర్యలు చేయడం.
ఉదా.ఒక ముసలాయన రోడ్డు దాటి లేని స్థితి లో మనం రోడ్డు దాటించడం. ఇక్కడ చూపు "నేను" నాకు" అనే వైపుకు తిరగలేదు.

2) *స్వార్థం* జరుగుతూ వున్న సంఘటన లో, నేను కనుక జోక్యం చేసుకుంటే  నాకేమైనా లాభమా అని ఆ సంఘటనని నా అనే కేంద్ర నుండి పరిశీలించడం.
 ఉదా.ముసలాయనను రోడ్డు దాటించడంచేత నాకేమిటి లాభం అని ఆలోచిస్తూ లాభం వుంటేనే చేయడం.

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment