ii. i. 2-5. 050123-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*అసలు మన గమ్యం ఏమిటి..?*
➖➖➖✍️
*మనము మెన్న, నిన్న, నూతన సంవత్సరం అని ఒక సంవత్సరమునకు వీడ్కోలు పలికి, మరొక సంవత్సరమునకు స్వాగతము పలుకుతూ పండగలు , పార్టీలు,వినోదాలు చేసుకొంటున్నాము.*
*కానీ ఒక్కటి మాత్రం ఆలోచించడం లేదు.*
*అది ఏమిటంటే...*
*మన గమ్యము ఏమిటి , భూమి మీదకు ఎందుకు వచ్చాము, ఏమి చేస్తున్నాము, అని..!*
*ఈ భువికి మనం భగవంతుడు పంపగా వచ్చాము!! మరి భగవంతునికి ఈ సంవత్సరంలో ఎంత దగ్గరయ్యాము, ఆయనకు ఇష్టమైన పనులు ఎన్ని నిర్వహించాము, అని ఎప్పుడైనా ఆలోచించామా?*
*మనం నిజంగా అలా ఆలోచించిన రోజే నిజమైన నూతనం..!*
*భగవంతుడు మనకు చెప్పినది ఏమిటి..*
*"పరోపకారమిదం శరీరం" అన్నారు...*
*మరి మన ఈ దేహం ఎంతమందికి ఉపయోగ పడింది, అనే చింతన చేసుకోవాలి, క్యాలెండర్ లో సంవత్సరాలు మారినకొద్ది, మన ఆయిషు కూడా తగ్గిపోతుందని గ్రహించాలి,*
*ఉన్నన్ని రోజులు సమాజ హితమైన పనులు చేసి, పుణ్యకర్మల ఫలముతో మనమంతా భగవంతుని సామ్రాజ్యం లోనికి ప్రవేశించడానికి తగిన అర్హత పొందాలి, ఆయన యొక్క హృదయంలో స్థానం సంపాదించుకోవాలి, అప్పుడే నూతన సంవత్సరం..!*
*అలాగాకుండా రోజులు గడిచిపోవడం తేదీలు మారటం, సంవత్సరం రావడం పోవడం ఇవన్నీ ప్రాకృతమునకు సంబంధించినవి, ఇది అత్యంత సహజ పరిణామం, సిద్ధాంతాల ప్రకారం, ఈ సంవత్సరం దాటింది, క్రొత్తది వచ్చింది అనేభావన, మనం అనుసరిస్తున్నాము, కానీ*
*ఇది సత్యమూ కాదు, శాశ్వతమూ కాదు...*
*నిజానికి ఖగోళ పరంగా చూసినప్పుడు సూర్య చంద్రులు ఎక్కడికీ పోవటం లేదు గనుక, "రాత్రి - పగలు" అనేవే లేవు. తూర్పు లేదు, పశ్చిమ లేదు...*
*ఇంక సంవత్సరం రావడం పోవడం ఎట్లు జరుగుతుంది. ఇవన్నీ కేవలం క్యాలెండర్ ప్రకారం గడిచిన కాలానికి మనిషి పెట్టుకున్న గుర్తులు మాత్రమే..! ఈ భూ వలయాన్ని దాటితే ఈ లెక్కలు ఏ లెక్కలోకి రావు, అనంత విశ్వంలో ఇవన్నీ అణువంత ప్రభావం కూడా చూపలేవు, మన ఆలోచనలు విస్తృతమైతే ఇవన్నీ మనం భ్రమించే భ్రమలు మాత్రమే అని బోధపడుతుంది*
*కాబట్టి ఈ లెక్కలు పత్రాలు పక్కన బెట్టి మనమేమి చేయాలంటే, ఈసంవత్సరం క్యాలెండర్ అయిపోయింది, అది బయట పడేసి కొత్తది ఎలాగైతే పెడుతున్నామో, అదే విధముగా మన లోపల ఉండే కాలం చెల్లిన గుణములు, అక్కరకు రాని విధానాలు కూడా మార్చుకొన్నప్పుడే నూతన దినం అవుతుంది, మనం అంతా కూడా అవసరార్ధులకు చేతనైన సాయం చేస్తూ సామాజికంగా, అలాగే ఈ జీవితాన్ని ఇచ్చిన భగవంతుని నిత్యం స్మరిస్తూ ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలి!*
*అప్పుడే మన జీవితంలో నూతనం, లేదా నూతన సంవత్సరం..!*
*భగవంతునికి రాక పోకలు లేవు, రాక పోకలు లేని సర్వం సహా చక్రవర్తి భగవంతుడు..!*
*అతని దృష్టిపథంలోనే మన ఉఛ్వాస నిశ్వాసలు. ఈ ఊపిరి అతనిలో ఏకమయ్యేందుకు! మానవ జీవితం మహోన్నత అవకాశం!! కాబట్టి నిశ్వాస నిశ్శేషం అయ్యేలా జీవించి ఆ అర్హత పొందడానికి తగిన కృషి చేయాలి.*
*మనం ఎల్లవేళలా కర్మ చేత బంధింప బడినవారం, అందుకే మనం సత్కర్మలు ఆచరించాలి.*
*అవి ఏమిటి అంటే...*
*పవిత్రమైన పలుకులు పలకడం, అందరితో ప్రేమను పంచడం, పవిత్రమైన విషయాలు అభివృద్ధి పరచుకోవడం, సజ్జనుల సాంగత్యం చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఆకలి గొన్న వారికి అన్నం పెట్టడం...*
*ఇలాంటి వాటి ద్వారా పవిత్రమైన హృదయమును పొందడం... అపుడే మనలో పవిత్రత ఏర్పడుతుంది.*
*మరి ఇప్పటినుండైనా ప్రతీ రోజు రాత్రి పడుకునేముందు ఒకసారి ఈరోజు మనం చేసిన మంచి ఏమిటి చెడు ఏమిటి మనం ఎన్ని అబద్దాలు ఆడాము, ఎన్ని నిజాలు చెప్పాము, ఎందరికి మనవలన మేలు లేదా కీడు జరిగింది, మన ప్రవర్తన వలన ఎందరు క్షోభ పడ్డారు, మన నడవడికలో మోదం ఎంత? ఖేదం ఎంత? అని ఒకసారి గుర్తు చేసుకొని అందులో చెడును తొలగించుకొని మంచివైపు అడుగులు వేద్దాం! ఇలా చేస్తే దేవునికి అత్యంత ప్రీతిపాత్రులము మనమే అవుతాము*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment