నేటి ఆణి ముత్యాలు
*గొంతు పెంచడం., మాట్లాడడం ఎవరైనా చేయగలరు.., అది పెద్ద విషయం కాదు..,*
*గొంతు పెంచడం కాదు.., మాట విలువను పెంచుకోవడం నేర్చుకోవాలి..,*
*మాటే మంత్రము...,**నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది అంటారు..,*కావున... మన నోటిని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి..,*
కోపం అగ్గిపుల్ల లాంటిది,*_ _*చటక్కున అంటుకుంటుంది*_
*_ఆరిపోయేంత వరకు ఆగితే పరవాలేదు*_
_*ఆలా కాకుండా అది ఆరిపోకముందే ఇసిరేస్తేనే ప్రమాదం*_..
_*అది మిగిలిన వాటిని కూడ కాలుస్తుంది..*_
_*అలానే వచ్చిన కోపం చల్లారెవరకు ఎవరితో మాట్లాడకండి, మౌనం వహించండి*_
*మౌనంగా ఉండడం నేర్చుకోవాలి.., మాట్లాడే ముందు ఆవేశ పడకుండా నిలకడగా మాట్లాడటం నేర్చుకోవాలి..,*
*ఈ స్థితిని పొందాలి అంటే మౌనం పాటించడం నేర్చుకోవాలి.., ధ్యానం సాధన చేయడం పాటించాలి..,*
*ధ్యాన సాధన ద్వారానే మానసిక ప్రశాంతతను మనం పొందగలుగుతాము..,*
*నిలకడగా నిదానంగా దేనినైనను సాధించగలుగుతాము.
శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment