*పూజ్య గురువులు డా. చాగంటి కోటేశ్వరరావు గారి పరమ గురువులు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు కాసేపటి క్రితం శివైక్యం చెందారు.*
*వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము.*
*"ఎవరి నామం విన్నంత మాత్రాన శ్రీ చాగంటి వారు అప్రయత్నంగా చేతులు జోడిస్తారో, ఎవరి దర్శన మాత్రాన తాను" "స్వర్ణ దండం లా నేల మీద పడి ప్రణిపాతం చేస్తారో, ఆ అమరేశ్వర ప్రసాద్ గారు, విశ్వమిత్రులు. విశ్వామిత్రులు. " "హస్త మస్తక సంయోగం చేత, తన శిష్యుడికి బాల్యంలో మంత్రోపదేశం చేయడమే కాదు… ఇన్నేళ్ళ తర్వాత ఈ రోజుకు" "కూడా, వారు చేసుకుంటున్న జప తపాదులలో భాగాన్ని మా గురువు గారి ఆయురారోగ్య అభివృధ్ధుల కోసం " "ధార పోస్తున్నారంటే, వారి త్యాగానికీ, వాత్సల్యానికీ హద్దెక్కడ !!!"*
*"వాచిక గురువైనా, సూచక గురువైనా, బోధక గురువైనా, పరమ గురువైనా, జగద్గురువైనా, ఏ గురువు గారి గురించి చెప్పే"* *"ప్పుడైనా, శ్రీ చాగంటి వారి ఉద్వేగం పతాక స్థాయిలో ఉండటానికి కారణం వారికి ఉపదేశానుగ్రహం ఒసగిన బ్రహ్మశ్రీ" మల్లంపల్లి వారే.*
*"తను ఆదేశిస్తే, శిష్యుడు ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా, ఉత్తర క్షణం తన ముందు వాలతాడన్న సత్యాన్ని ఎరిగి" "కూడా, ఆయన స్వయంగా శిష్యుడి దగ్గరకు వెళ్ళడానికే మొగ్గు చూపిస్తారు . శిష్యుణ్ణి కంది పోకుండా కాపాడుకోవాలన్న" "తాపత్రయానికీ, పితృ ప్రేమకూ నిలువెత్తు నిదర్శనం శ్రీ మల్లంపల్లి వారు. మా అందరికీ '' పరమ గురువులు "" .*
No comments:
Post a Comment