Thursday, January 12, 2023

మనిషికి అనుభవాలే పాఠాలు నేర్పుతాయి. అది ఎలాగో తెలుసుకుందాం.

 మనిషికి అనుభవాలే పాఠాలు నేర్పుతాయి. అది ఎలాగో తెలుసుకుందాం.

 ఎవరికి వారు వారి స్వభావాలను బట్టే ప్రవర్తిస్తుంటారు. కష్టాలను తప్పించుకునే ప్రయత్నంలో పొరపాట్లు చేస్తూనే, సుఖాల కోసం పరుగులు తీస్తుంటారు.

గుహల్లో నివసించే మనిషి 'నీ సంపద నాది' అన్నాడు. తన బలాన్ని ప్రదర్శించాడు జంతువులాగా, రాతియుగపు మానవుడు చేసిన ఆనైతికమైన పనులు ఈ రోజున చెల్లుబాటు కావు. మనిషి నైతికతకు ఎంతవరకూ కట్టుబడి ఉన్నా పూర్తి తన స్వభావాన్ని విడిచిపెట్టలేదు. మరొకరి సంపదను దోచుకోవాలనుకునేవారు, పరస్త్రీలను వశపరచుకోవడంలో ఆనందం వెతుక్కునేవాళ్లు నేటికీ కనిపిస్తూనే ఉంటారు. మనిషిలో ప్రవృత్తులకు, అంతరాత్మకు మధ్య నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ప్రతి క్షణం భారం చాలామందికి. ప్రతి పరిస్థితి నరాలపై ఒత్తిడి కలిగిస్తుంది. పరస్పర చర్య ఉద్రిక్తతకు దారితీస్తుంది. అహంతో నిండిన గుండెకు ఎప్పుడూ నిప్పులమీద నడకే. అహం నింపుకొన్న మనిషి అనుక్షణం ప్రతి పరిస్థితిలోనూ గెలుపుకోసం పోరాడుతుంటాడు. ఇతరులకంటే తాను గొప్ప అనిపించుకోవాలనే తాపత్రయంతో బతుకుతాడు.

మహాభారతం | విశాల విశ్వంలోని ప్రతి అంశాన్నీ ప్రతిబింబిస్తుంది. ఈ మహేతిహాసంలోని పాత్రలు చిన్నా- పెద్దా, మంచీచెడు, ప్రాముఖ్యం కలిగినవి. లేనివి... అన్నీ ఏ కాలానికైనా పోల్చదగినవి. దుర్యోధనుడు, కనిపించని కాలం గోచరించదు.
ధృతరాష్ట్రుడు, అర్జునుడు...
భిన్న మనస్తత్వాలు, చిత్రమైన గుణగణాలు కలిగిన మనుషులు ఇందులో కనిపిస్తారు. ఇది వ్యక్తిత్వాలకు దర్పణం పట్టే పవిత్ర గ్రంథం. విభిన్న వ్యక్తిత్వాలు గలవారితో ఎలా వ్యవహరించాలన్నది తెలుసుకోవడం, తెలుసుకుని మసలుకోవడం కోసం మనం అభిమానించేవి కొన్ని, గుర్తించుకునేలాంటివి మరికొన్ని మహాభారత పాత్రలు. ద్రౌపది- అయిదు గొప్ప గుణాలు కలిగిన భర్తను కోరుకుంటుంది. ఒకరిలోనే ఆ గుణాలు కనబడక అయిదుగురిలో చూసుకుంటుంది.

భారతంలో మంచివాళ్లు సైతం తప్పులు చేస్తారు... అయితే, వారి ఉద్దేశాలు హానికరమైనవి. చెడ్డవి కావు. ఎవరూ పరిపూర్ణులు కారు అనడానికి అది తార్కాణం. ఒక చిన్న లోపం కూడా పాత్రకు అందాన్ని జతచేస్తుందనిపిస్తుంది. మనిషి తన లోపాలను కనబడకుండా దాచాలనే ప్రయత్నం చేయకూడదు. కపట ధోరణి పనికిరాదు. వ్యక్తిత్వం మెరుగుపడాలంటే ఆత్మపరిశీలన అవసరం, తమకు తాము నిష్పాక్షికంగా తప్పొప్పులను స్వీకరించే గుణం పెంచుకోవాలి. ఏ మనిషైనా బాధతో జీవించడానికి లెక్కలేనన్ని మార్గాలున్నాయి. సంతోషంగా జీవించాలంటే మాత్రం కొన్ని మార్గాలే కనిపిస్తాయి. సంతోషంగా ఉండటానికి అవసరమైన మార్గాలను పెంచుకోవడం, బాధపెట్టేవాటిని తగ్గించుకోవడంలోనే మనిషికి వివేకం అవసరమవుతుంది. వివేకం కలిగిన మనిషి జీవితం నందనవనం..

- మంత్రవాది మహేశ్వర్
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment